ఉద్వేగానికి లోనైన ఉమాభార‌తి, సాధ్వి రితంబర

ఉద్వేగానికి లోనైన ఉమాభార‌తి, సాధ్వి రితంబర

వారిద్దరూ అయోధ్యలో రామమందిరం కోసం జరిగిన పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిన సాధ్వీమానులు. కాషాయ వస్త్రధారణతోనే ఆవేశంగా ప్రసంగాలతో లక్షలాదిమంది హిందువులను మేల్కొల్పేందుకు కృషి చేశారు. కరసేవలో, ఇతర ఉద్యమాలలో  అగ్రభాగంలో నిలిచారు. ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యారు. ఇప్పుడు తమ స్వప్నం నెరవేరడంతో పరస్పరం ఆనందభాష్పాలతో అభినందించుకొంటున్న దృశ్యం.

వారిద్దరూ ఉమాభారతి, సాధ్వి రితంబర.  అయోధ్య‌లో రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ వేడుక సంద‌ర్భంగా  కలుసుకున్నప్పుడు  ఉమాభార‌తి ఉద్వేగానికి లోన‌య్యారు. న సాధ్వి రితంభ‌ర‌ను ఉమాభార‌తి ఆలింగ‌నం చేసుకుని ఆనంద‌భాష్పాలు రాల్చారు. ఎన్నో పోరాటాల త‌ర్వాత చివ‌ర‌కు త‌మ స్వ‌ప్నం నెర‌వేర‌డంతో ఉమాభార‌తి, సాధ్వి రితంభ‌ర రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ వేడుక‌కు హాజ‌రై, త‌మ రామ‌భ‌క్తిని చాటుకున్నారు.

32 ఏండ్ల 46 రోజుల క్రితం నాటి జ్ఞాప‌కాల‌ను ఉమాభార‌తి ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. హిందూవులు బాబ్రీ మ‌సీదు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రామ జ‌న్మ‌భూమి ఉద్య‌మంలో ఉమాభార‌తి చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు అదే స్థ‌లంలో ఇవాళ రామాల‌యం కొలువుదీర‌డంపై ఉమాభార‌తి సంతోషం వ్య‌క్తం చేశారు.

హిందూవులంద‌రూ రాముడిని ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కొలుస్తార‌ని ఆమె పేర్కొన్నారు. అయోధ్య‌లో రామాల‌యం ప్ర‌తిష్ఠాప‌న కోసం ఆ రాముడు త‌మ‌కు ధైర్యం ఇచ్చార‌ని సాధ్వి రితంభ‌ర తెలిపారు. ఆ తర్వాత ఉమాభారతి మధ్యప్రదేశ్ లో బిజెపిని అధికారంలో తీసుకు రావడంలో కీలక పాత్ర వహించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో కూడా చేశారు.

కాగా, రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ ప్రాణ‌ప్ర‌తిష్ఠ వేడుక‌కు దూరంగా ఉన్నారు. అయితే వీరిద్ద‌రి వ‌య‌సు 90 ఏండ్ల‌కు పైగా ఉండ‌టంతో, తమ వ‌య‌సు, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీ, ఉమా భార‌తి, సాధ్వి రితంభ‌ర‌త‌పై అభియోగాలు మోప‌గా, 2020లో ప్ర‌త్యేక సీబీఐ కోర్టు వారిని నిర్దోషులుగా ప్ర‌క‌టించింది.