గాజాలోని పాలస్తీనా యూనివర్శిటీ ప్రధాన భవనంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) దాడి చేపట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం విడుదలైన ఈ వీడియోలో యూనివర్శిటీ భవనం కనిపించగా, అనంతరం లోపల ఉంచిన బాంబుల కారణంగా పేలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
అనంతరం ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ వీడియోపై స్పష్టత నివ్వాల్సిందిగా అమెరికా ఇజ్రాయిల్‌ను ఆదేశించింది. వీడియోపై తగిన సమాచారం లేదని, స్పందించేందుకు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి డేవిడ్ మిల్లర్ నిరాకరించారు. నిర్మానుషంగా ఉన్న యూనివర్సిటీ బిల్డింగ్ అకస్మాత్తుగా పేలుతుంది.
ఆ బిల్డింగ్‌లో దాచిపెట్టిన పేలుడు పదార్ధాల వల్ల అది పేలినట్లు తెలుస్తోంది. పేలిన తర్వాత అన్ని దిక్కులా శిథిలాలు ఎగిరిపడ్డాయి. భారీ స్థాయిలో పొగ కూడా వచ్చింది. దక్షిణ గాజాలోని ప్రధాన నగరమైన ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయిల్ వైమానిక, తుపాకీ కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే.
హమాస్ నేతలు ఈ ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పరుచుకున్నారని.. అందుకే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అల్ అమాల్ అస్పత్రి సమీపంలో ఫిరంగి కాల్పులు వినిపించినట్లు పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ పేర్కొంది. ఒక్క రాత్రిలోనే 77 మంది మరణించినట్లు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

More Stories
గ్లోబల్ సౌత్ లో భారత్, రష్యా, చైనా దేశాలే కీలకం
నేరచరిత్ర లేని 75 వేల మందిని అరెస్ట్ చేసిన అమెరికా
థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు