రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు?

రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు?
రైతు భరోసాకు కావాల్సిన డేటా ప్రభుత్వం దగ్గర ఉంద‌ని, మళ్ళీ దరఖాస్తు కోసం ఎందుకు తిరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. అభయహస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం నెలకొందని పేర్కొంటూ ఆ ఫారం నింపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని చెబుతూ ఇదంతా కాలయాపన కోసమే అని ధ్వజమెత్తారు. .
ఫారాలను బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తుందని అంటూ దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రేష‌న్ కార్డు నిబంధ‌న ఎత్తివేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రేషన్ కార్డులు ఇవ్వలేద‌ని తెలిసి కూడా రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? అని ప్రశ్నించారు. 
 
ఉద్యమ సమయంలో కేసులు ఎవరి మీద నమోదు అయ్యాయో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రూ. 2,500ఎవరికి ఇస్తారు? బిపిఎల్ ఫ్యామిలీ కి ఇస్తారా? డేటా ఉంది కదా? అని ప్రశ్నించారు. దరఖాస్తుల డ్రామా పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రజలను తిప్పుకోవడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.

రాహులే ప్ర‌ధాని మోదీ  మెడిసిన్ ఎక్స్పైరీ అయిందని రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యాలను కొట్టిపారవేస్తూ   ఆయన ఎప్పుడు ఆ మందు వేసుకున్నారో చెప్పాల‌ని నిలదీశారు. మెడిసిన్ ప్రపంచానికే సంజీవని అని పేర్కొంటూ రాహుల్ గాంధీ మెడిసిన్ రిజెక్ట్ అయిందని పేర్కొంటూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయిందని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదని, బీఆర్ఎస్ ఓడి పోయిందని కిషన్ రెడ్డి చెప్పారు.  కాళేశ్వరం విషయంలో న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ చేయించాలని ఎన్నికలప్పుడు కోరిని విష‌యాన్ని రేవంత్ కు ఆయన గుర్తు చేశారు.. కాళేశ్వ‌రం విష‌యంలో కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని, అయితే ఇంత వ‌ర‌కు సిబిఐ విచార‌ణ‌కు మాత్రం లేఖ రాయ‌లేద‌ని విమ‌ర్శించారు. 

సీఎం గా ఉన్న వ్యక్తి ఎంపి గా ఉన్నప్పుడు ఆధారాలు అన్ని తన దగర ఉన్నాయంటూ బీరాలు ప‌లికారాని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ సీబీఐ కి ఉత్తరం ఎందుకు రాయ‌లేదో వెల్ల‌డించాల‌ని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.