ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల పక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ నియోజకవర్గానికి చెందిన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించవలసిందిగా ఆదేశించాలు ఇచ్చింది ఈసీ. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్‌ను వెల్లడించగా ఓటర్ల నమోదు ప్రక్రియకు శనివారం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది.
ఫిబ్రవరి 6కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, 24వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించాలని పేర్కొంది. ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్యెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్త ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా, ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా, ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా చివరకు పల్లా విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.

More Stories
‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ పోస్టర్ ఆవిష్కరణ
కేశవ నిలయంలో “పంచ పరివర్తన్”పై ఏఐలో కార్యశాల
తెలంగాణాలో మంత్రులు సహా వందల వాట్సాప్ గ్రూపుల హ్యాక్