మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు. మరోవైపు కొలరాడో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు కొలరాడో కోర్టు షాకిచ్చింది.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021లో కేపిటల్ భవనంపై జరిగిన దాడి కేసులో ట్రంప్ ప్రమేయాన్ని నిర్ధారించి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా అతని పేరును బ్యాలెట్లోంచి తొలగించాలని ఆదేశించింది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం.
More Stories
గాజాపై ఇజ్రాయెల్ దాడిలో భారతీయుడు మృతి
రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తొలగింపు
సూర్యుడి ఉపరితలంపై విస్పోటనాలు