తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు బాధ్యతలు

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు బాధ్యతలు
తెలంగాణాలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. కీలకమైన ఆఫీస్ బేరర్లు సమావేశం జిల్లా అధ్యక్షులతో పాటు గురువారం జరుపుతూ ఉండగా, శనివారం రాష్త్ర మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీలో ముఖ్య నేతలకు కీలక బాధ్యతలను అప్పచెప్పారు.
 
తెలంగాణను ఆరు జోన్లుగా విభజించి ముఖ్య నాయకుల్ని ఇంచార్జిలుగా నియమించారు. కర్ణాటక, మహారాష్ట్ర నేతలకు జిల్లాలను కేటాయించి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక మాజీ మంత్రులకు సైతం తెలంగాణ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా కొన్ని జిల్లాలకు బాధ్యతలు అప్పగించారు.

మేనిఫెస్టోఅండ్పబ్లిసిటీకమిటీచైర్మన్గావివేక్వెంకటస్వామిని,కన్వీనర్గామహేశ్వర్రెడ్డి,జాయింట్కన్వీనర్గాకొండావిశ్వేశ్వర్రెడ్డిని; హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించారు.  క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా వదిరే శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డి, ఎస్టి నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావును తెలంగాణ బిజెపి నియమించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ. ఇందులో భాగంగా. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పబ్లిక్‌ మీటింగ్‌ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్‌, మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్‌ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావులను ఎంపిక చేసింది. 

వీటితో పాటు నిరసనలు, ఆందోళన నిర్వహణల కమిటీ చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌, సోషల్ ఔట్రీచ్ కమిటీ కన్వీనర్‌గా ఎంపీ లక్ష్మణ్,  మీడియా కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే రఘునందనరావులకు బాధ్యతలు అప్పజెప్పారు. పార్లమెంట్‌,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నారు.