జాతీయ భావంతోనే మట్టిని సేకరిస్తున్నామని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరించేందుకు బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీ అధిష్టానం దేశవ్యాప్తంగా ‘మేరీ మాటీ – మేరా దేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని, జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మట్టిని సేకరించేందుకు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారని తెలిపారు.
`నా భూమి నా దేశం’ కార్యక్రమంలో భాగంగా సుజనా చౌదరి బీజేపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో బీజేపీ నేతలకు ఘన స్వాగతం లభించింది. బిజెపి ఆలోచన మేరకు ‘ఏక్ భారత్ – శ్రేష్ట భారత్’ అనే విశ్వాసంతో అందరం కలిసి, అందరి కోసం పనిచేయాలనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టామని సుజనా చౌదరి తెలిపారు.

‘‘అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మేరీ మాటి – మేరా దేశ్’ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామగ్రామాన పర్యటించి మట్టిని తీసుకుంటున్నాం” అని గ్రామస్థులకు ఆయన వివరించారు.
‘తరతరాలుగా ప్రజల్లో నాటుకుపోయిన వలసవాద మనస్తత్వ ఆలోచనలను తొలగించి, అభివృద్ధి చెందిన భారతదేశంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దటమే నా భూమి – నాదేశం కార్యక్రమం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన’ అని వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు