
భారత రాజ్యాంగంలోని శాశ్వత లక్షణమైన ఆర్టికల్ 1, ఆర్టికల్ 370కు సంబంధించి ఎప్పుడూ `శాశ్వతంగా ఉండాలనే’ ఉద్దేశం లేనట్లు “స్పష్టమైన సూచిక” అని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370కి చేసిన మార్పులు, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి అధ్యక్షత వహించిన భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఆర్టికల్ 1 రాజ్యాంగపు శాశ్వత లక్షణం. ఆర్టికల్ 1 వర్తించే నిర్దిష్ట సూచనను ఆర్టికల్ 370(1) కలిగి ఉండటానికి కారణం ఏమిటి? ఆర్టికల్ 1 ఏ సందర్భంలోనైనా వర్తిస్తుంది. ఇది రాజ్యాంగంలో పొందుపరచబడిన భాగం,” అని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఆర్టికల్ 370కి మార్పులను వ్యతిరేకిస్తూ వాదనలు చేస్తున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
ఆర్టికల్ 370లో ఆర్టికల్ 1 ప్రస్తావన ఎందుకు ప్రవేశపెట్టబడిందనే దానిపై, ఆయన ఇలా చెప్పారు: “మధ్యంతర కాలంలో, రాజ్యాంగంలోని నిబంధనలను సవరించే అధికారం ఉన్నప్పుడు – సంప్రదింపులతో విలీనం ప్రక్రియకు సంబంధించినవి – ఆర్టికల్ 1 కూడా సమ్మతితో సవరించబడిందా? అనే సందేహం ఉండేది. కాబట్టి ఆర్టికల్ 1 రాజ్యాంగపు శాశ్వత లక్షణం అనే రాజ్యాంగ ప్రకటనను రెట్టింపు చేయడమే ఆర్టికల్ 370లో ఉంచడం లక్ష్యం”.
“ఇప్పుడు ఆర్టికల్ 370 శాశ్వతంగా ఉండాలని భావించినట్లయితే, ఆర్టికల్ 1 ను ఆర్టికల్ 370లో చేర్చడానికి ఎటువంటి కారణం లేదు. ఎందుకంటే ఆర్టికల్ 1 ఏమైనప్పటికీ రాజ్యాంగపు శాశ్వత లక్షణం. చట్టసభ సాధారణ శాసనాలకు “మేము మిగులు సూత్రాన్ని వర్తింపజేయవచ్చు” అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
“మీరు రాజ్యాంగ నిర్మాతలకు మిగులు మొత్తాన్ని లేదా అర్థం లేకుండా ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని ఎప్పటికీ ఆపాదించలేరు” అని పేర్కొన్నారు. ఈ కోణంలో ఆయన ఇలా వివరించారు: “ఆర్టికల్ 1ను ప్రత్యేకంగా ఆర్టికల్ 370లో ఎందుకు ప్రస్తావించారు అంటే, ఆ మధ్యంతర కాలంలో ఇతర నిబంధనలను సవరించవచ్చు, ఆర్టికల్ 1 సవరించబడదని వారు చాలా స్పష్టంగా చెప్పారు.ఇది స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 370 ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశ్యం కాదు”.
న్యాయమూర్తులు ఎస్కే కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు శంకరనారాయణన్ మాట్లాడుతూ, ఈ కేసు “అధికారం ఉందా? ఆ అధికారాన్ని వినియోగించే ప్రక్రియ అనుసరించబడుతుందా? అనే దానిపై ప్రభావవంతంగా ఉంటుంది” అని తెలిపారు.
ఆర్టికల్ 3 రాష్ట్రంలోని కొంత భాగాన్ని యుటిగా మార్చడానికి అనుమతిస్తుంది. దీన్ని చేయడానికి ఒక విధానం ఉంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఈ విధానాన్ని అనురసింపలేదని ఆయన స్పష్టం చేశారు. “ఆ అధికారాన్ని వినియోగించే విధానం 1970 నుండి (ప్రైవీ పర్స్ రద్దు చేయబడినప్పుడు) ఈ దేశంలో మనం చూస్తున్న మోసపూరితమైన, అధికార వినియోగంలో ఒకటి” అని ఆయన చెప్పారు.
మంగళవారం, ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ అసెంబ్లీలోని ఒక వ్యక్తి చేసిన ప్రసంగం ఎంత గంభీరమైనదైనప్పటికీ జమ్మూ కాశ్మీర్ కు మొత్తం భారతదేశపు భరోసాను సూచిస్తుందా? అని అడిగారు. బుధవారం ఈ ప్రశ్నకు స్పందిస్తూ, సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి ఇలా అన్నారు: “ఇది మనపై ఒక ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను వేస్తుంది: భారత రాజ్యాంగాన్ని వ్యవస్థాపకుల రాజ్యాంగ ఉద్దేశ్యానికి విరుద్ధంగా మార్చవచ్చా?…”
ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హోదా జోలికి పోము
ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హోదా జోలికిపోమని, ఆ ప్రత్యేక నిబంధనలను తాకే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జమ్మూకాశ్మీర్‌కు తొలగించబడిన ప్రత్యేక ప్రతిపత్తికి అవి భిన్నంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వాదించింది. న్యాయవాది మనీష్ తివారీ వాదనకు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ వచ్చింది.
న్యాయవాది తివారీ వాదిస్తూ స్వాతంత్య్రానంతరం, భారతదేశం తన పరిధులను రాజ్యాంగపరమైన హామీలతో నిర్వహించాలని నిర్ణయించుకుందని, ”మేము గణతంత్రాన్ని నిర్మిస్తున్నాము” అని పేర్కొందని పేర్కొన్నారు. దేశ సరిహద్దులో ఒక చిన్న భయం కూడా తీవ్రమైన చిక్కులను కలిగిస్తుందని పేర్కొంటూ, మణిపూర్‌లో 150 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న హింసాకాండాను ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఆర్టికల్ 370 ”తాత్కాలిక నిబంధన”, ఈశాన్య రాష్ట్రాలకు “ప్రత్యేక నిబంధన”ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ”ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఇస్తూ పేర్కొన్న ఏ నిబంధనను ముట్టుకునే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ వాదన దుర్మార్గం” అని వాదించారు.
ఆర్టికల్ 370కి సంబంధించిన అంశం మినహా మరే ఇతర అంశాలను నమోదు చేయబోమని, ఈ వాదనలను జమ్మూ కాశ్మీర్‌కే పరిమితం చేయాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కోరారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం