
శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులంతా డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను ముందుగా 12 గంటల వరకు, ఆ తర్వాత 12.30 గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం కూడా సభలో అదే పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధిక వాయిదా వేశారు. జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని ఆయన వివరించారు. 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, 22 బిల్లులను సభ ఆమోదించినట్టు చెప్పారు.
సభా కార్యక్రమాల్లో భాగంగా జూలై 26న కేంద్రంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు ప్రవేశపెట్టగా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. దీనిపై మూడు రోజుల పాటు చర్చ జరిగింది. 60 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఇక రాజ్యసభలో ఆఖరిరోజైన శుక్రవారం కూడా విపక్షాల నిరసనల నడుమే చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజ్యసభను నిరవధిక వాయిదా వేశారు
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు