చంద్రయాన్-3కి పోటీగా లూనా 25ని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది. రష్యాలోని తూర్పు అముర్ ప్రాంతంలోని లాంచింగ్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల 10 నిమిషాలకు లూన్ 25 మూన్ ల్యాండర్‌తో కూడిన సోయుజ్-2.1బీ రాకెట్ నింగిలోకి ఎగిరింది. ఈ లూనా 25, చంద్రయాన్-3లు ఒకే రోజు చంద్రుడిపై అడుగుపెడతాయని తెలుస్తోంది.
దాదాపు 50ఏళ్ల తర్వాత చంద్రుడిపై రష్యా మిషన్ చేపట్టింది. చివరిగా 1976లో లూనా-24ను ప్రయోగించింది. ఈ మిషన్‌తో చంద్రుడిపై ఉన్న 6.2 ఔన్సుల (170గ్రాములు) మట్టి శాంపిళ్లను భూమికి తీసుకురాగలిగింది. ఇక అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ లూనా-25 మరో ఐదు రోజుల్లో చంద్రుడి దగ్గరికి చేరుకుంటుంది.
అక్కడి నుంచి 5-7 రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. సరైన సమయం చూసుకుని చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతంలో దిగుతుంది. సేఫ్ ల్యాండింగ్ తర్వాత ఈ మిషన్ ఏడాది కాలం పాటు చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. వాస్తవానికి ఈ లూనా-25 దాదాపు రెండేళ్ల పాటు ఆలస్యమైంది. గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇందుకు ప్రధాన కారణం.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి ఈ రాకెట్‌కు పైలట్-డీ నేవిగేషన్ కెమెరా అందాల్సి ఉంది. యుద్ధానికి వ్యతిరేకంగా. రష్యాకి సాయం చేయమని ఈఎస్ఏ తేల్చి చెప్పింది. ఇదే విధంగా పలు ఇతర అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ మిషన్‌కు సాయం చేయడం ఆపేశాయి. ఫలితంగా మిషన్ చాలా ఆలస్యమైంది.
రష్యా ప్రయోగించిన లూనా-25 బరువు 66 పౌండ్లు. అంటే 30 కేజీలు. ఇందులో సర్వీస్ టెలివిజన్ సిస్టెమ్, సాయిల్ ఇంటేక్ డివైజ్‌తో కూడిన లూనార్ మానిప్యులేటర్ కాంప్లెక్స్, న్యూట్రాన్- గామా డిటెక్టర్ (వాటర్ ఐస్‌ని కనుగొనేందుకు), ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, లేజర్ మాస్ స్పెక్ట్రోమీటర్, ఐయాన్ ఎనర్జీ మాస్ ఎనలైజర్, డస్ట్ మానిటర్, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ యూనిట్ వంటి పరికరాలు ఉన్నాయి.
చందమామ సౌత్ పోల్‌పై ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తల ఫోకస్ పెరిగింది. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఇటీవలే ప్రయోగించిన చంద్రయాన్-3 కూడా సౌత్ పోల్లోనే పరిశోధనలు చేపట్టనుంది. గత నెల 14న ప్రయోగించిన ఈ చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. మరోవైపు అర్తెమిస్ ప్రోగ్రామ్ ద్వారా 2020 దశకం చివరి నాటికి చందమామ సౌత్ పోల్‌పై అనేక ప్రాజెక్టులను చేపట్టేందుకు నాసా సైతం సిద్ధమవుతోంది.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్