
చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చంద్రుడికి అతి చేరువలోకి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ తాజాగా ఒక వీడియోను రికార్డు చేసి పంపింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది.
ఈ చిత్రాల్లో చందమామ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇస్రో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల వంటి అరుదైన దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తోందంటూ ట్విట్టర్‌లో ఇస్రో వీడియో షేర్ చేసింది.
ఈ వీడియోలో చంద్రుడు అతి దగ్గరగా కనిపిస్తున్నాడు. చంద్రుడి ఉపరితలంపై గల బిలాలు కనిపిస్తున్నాయి. చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలో తిరుగుతుండగా ఈ వీడియో తీసింది. వెలుగు వైపు నుంచి చంద్రుడికి చీకటి వైపు వెళ్లుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపించింది.
ఆగస్టు 1వ తేదీన చంద్రుడిని చేరే లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది.
అనంతరం శనివారం రాత్రి 7 గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది. లూనర్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని, చంద్రయాన్-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు.
అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకళ్తారు. తదనంతరం ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు. చంద్రయాన్-3ని చంద్రుడికి మరింత దగ్గర చేసే దిశగా ఈ నెల 9న మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 9న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్