
తర్వాత ప్రధాని మోదీకి గౌరవ వందనం లభించింది. ఐక్యరాజ్యసమితి చొరవతో ప్రపంచ వాతావరణ పరిరక్షణ దిశలో ఏర్పాటు అయిన కాప్ 28 సదస్సుకు ఈ సారి యుఎఇ సారథ్యం వహించనుంది. దుబాయ్‌లో ఈ ఏడాది నవంబర్ 28 నుంచి జరిగే ఈ సదస్సుకు భారతదేశం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ప్రధాని తెలిపారు.
కాప్ సదస్సుకు దేశాధ్యక్ష ప్రతినధి సుల్తాన్ అల్ జబేర్ శనివారం ఇక్కడ ప్రధాని మోదీతో మాట్లాడారు. సదస్సు గురించి వివరించారు. అబూధాబిలో ప్రధాని మోదీకి దేశాధ్యక్షులు నహ్యాన్ తమ అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఆద్యంతం ప్రత్యేకమైన కూరగాయలతో కూడిన శాకాహార షడ్రుచుల భోజనం అందించారు.
స్థానికంగా సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలతో, గోధుమల హరీస్‌తో, ఖర్జూర సలాడ్, మసాలా సాస్, పండ్లు వంటివాటితో విందు ఏర్పాటు అయింది. ప్రధాని మోదీ శాకాహారి కావడంతో ఈ ఏర్పాట్లు జరిగాయి. వంటకాలకు వాడిన నూనె కూడా కూరగాయలతో తయారు చేసిందే. విందుకు ముందు స్టార్టర్లుగా దోరగా కాల్చిన కూరగాయలను వడ్డించారు.
అబుధాబిలో ఐఐటీ- ఢిల్లీ క్యాంపస్
ఇలా ఉండగా, గల్ఫ్‌లో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్‌ను ఆరంభించనుంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ విషయమై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అబూధాబి విద్యా, విజ్ఞాన విభాగం (ఎడిఇకె) మధ్య అబూధాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ స్థాపనకు సంబంధించిన అవగావహనాపత్రాలు (ఎంఒయు)పై సంతకాలు జరిగాయి.
ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ విద్యారంగం అంతర్జాతీయకరణ దిశలో ఇదో ముందడుగు అని పేర్కొన్నారు. విద్య అనేది మానవాళిని కలిపే బంధం అని, భారతదేశపు సృజనాత్మక శక్తికి ఇక్కడ ఐఐటి ఢిల్లీ ఏర్పాటు కీలకం అవుతుందని తెలిపారు.
ఇప్పటికే ఐఐటి మద్రాసు గత వారం టాంజెనియాలోని జంజిబార్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకారం కుదుర్చుకుంది. దీనితరువాత ఐఐటి ఢిల్లీ ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. అబూధాబిలో వెలిసే ఐఐటి ఢిల్లీ క్యాంపస్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచి మాస్టర్స్ కోర్సులు ఆరంభిస్తారు. సెప్టెంబర్ నుంచి డిగ్రీ కోర్సులు ప్రారంభిస్తారని అధికారికంగా వెల్లడించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!