అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్, ఎక్స్ పో ప్రపంచంలోని పురాతన నగరమైన వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనెల 22 నుండి 24 వరకు నిర్వహిస్తున్నారు. టెంపుల్ కనెక్ట్ (ఇండియా) ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాల నిర్వహణకు అంకితం చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి సదస్సు.
ఆలయ ఆవరణ వ్యవస్థల పాలన, నిర్వహణ, కార్యకలాపాలను పెంపొందించడం, సాధికారత కల్పించడంపై ఇది దృష్టి సారిస్తోంది. జైన ధర్మశాలలు, ప్రముఖ భక్తి ధార్మిక సంస్థలు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందూ దేవాలయాల సంఘాలు, ఇస్కాన్ దేవాలయాలు, అన్న క్షేత్ర నిర్వాహకులు, వివిధ యాత్రికుల ప్రదేశాల పురోహిత్ మహా సంఘాలు, తీర్థయాత్ర ప్రమో షన్ బోర్డుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ సదస్సును ప్రారంభిస్తారు. ఈసందర్భంగా టెంపుల్ కనెక్ట్, ఐటీసీఎక్స్ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి మాట్లాడుతూ భక్తి విధిలో ముందంజగా టెంపుల్ కనెక్ట్ అనేది ఒక ప్రార్ధనా స్థలంలో భక్తుని అనుభవాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని తెలిపారు.
విశ్వాసం ద్వారా ప్రజలను ఆకర్షించే పవిత్ర భూమికి సంబంధించి అది సజావుగా పనిచేయడం అత్యవసరమని ఆయన చెప్పారు. క్యూలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి విరామంలో బెంచీలు, తాగునీటి సదుపాయం, భక్తులు ఆవరణలోకి ప్రవేశించిన క్షణం నుండి వారి అనుభవాన్ని చూసుకునే వ్యవస్థీకృత వ్యవస్థ చాలా కీలకమని పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో 2023 చైర్మన్, మహారాష్ట్ర శాసన మండలి హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్ ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ ఐటిసిఎక్స్ ఆలయ పర్యా వరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సాధికారత కల్పించడానికి గాఢమైన ప్రయత్నమని తెలిపారు.
ఇది పురాతన పర్యావరణ వ్యవస్థలలో ఒకటని చెబుతూ కన్వెన్షన్, దాని మొట్టమొదటి ఎడిషన్‌లో, అటువంటి స్థాయిలో, అందరినీ ఆకర్షించేలా నిర్వహించడం నిజంగా విశేషమని చెప్పారు. షో డైరెక్టర్ అండ్ కో-క్యూరేటర్ మేఘా ఘోష్ మాట్లాడుతూ ఆలయ నిర్వహణ కోసం ఒక ఫోరమ్‌ను రూపొందించడానికి ఎవరూ ప్రయత్నించలేదని గుర్తు చేశారు.
ఎల్లప్పుడూ మొదటగా ఒక కార్యక్రమం జరగాల్సి ఉంటుందని పేర్కొంటూ ఈ సదస్సు మన గొప్ప ఆలయ వారసత్వంపై జాతీయ గర్వకారణ భావాన్ని తెరపైకి తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవతరం సాంకేతికతతో దానిని రక్షించడానికి, మద్దతు ఇవ్వడానికి ఇది సమయమని తెలిపారు. తాము ఒకే విధమైన మూలాలతో ఉన్న నాలుగు మతాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు