
రష్యాలో విఫల తిరుగుబాటు అనంతరం అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తిరుగుబాటు వాగ్నర్ నేత యెవెజెని ప్రిగోజిన్‌ను కలిశారు. వీరి మధ్య ఏకాంత చర్చ జరిగిందని ఉక్రెయిన్ అధికార ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ సోమవారం తెలిపారు. తిరుగుబాటు ముగిసిన ఐదు రోజులకు జరిగిన ఈ భేటీ మూడు గంటల పాటు గత నెల 29న జరిగింది.
ఈ సందర్భంగా కొందరు ప్రిగోజిన్ సన్నిహిత సైనికాధికారులు కూడా ఉన్నారని పెస్కోవ్ వెల్లడించారు. మొత్తం 35 మందిని పుతిన్ ఈ సమావేశంకు ఆహ్వానించారు. వాగ్నర్ ప్రైవేటు సైన్యం రష్యా సేనలతో పాటు కలిసి ఉక్రెయిన్‌పై దాడులకు దిగింది. ఈ భేటీ సందర్భంగా తమ సేనలు రష్యాకు లోబడి ఉంటాయని, ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తామని పుతిన్ కు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అయితే ఏకంగా ఈ బృందం అధినేతనే పుతిన్ సైన్యంపై తిరుగుబాటుకు దిగడం, మాస్కో వరకూ ఆయన సేనలు సాగడం, మధ్యలోనే వెనుతిరిగి పోవడం వంటి పరిణామాలు జరిగాయి. పుతిన్ సైన్యానికి ప్రిగోజిన్‌కు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆయన తరువాత బెలారస్‌కు ప్రవాసానికి వెళ్లారు. ఇప్పుడు పుతిన్‌తో రహస్య భేటీ జరపడం కీలక పరిణామమని ఉక్రెయిన్ తెలిపింది.
పుతిన్ ఇప్పుడు తిరుగుబాటుదార్లతో జరిపిన చర్చల దశలో పూర్తి స్థాయిలో రాజీకి వచ్చినట్లు, వారి తిరుగుబాటుకు కారణాలను తెలుసుకుని, తమ వైపు నుంచి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తెలియచేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో మరింత దాడి క్రమంలో ఈ ప్రైవేటు సైన్యం సేవలను తిరిగి మరింత విరివిగా వాడుకుంటామని చెప్పినట్లు వెల్లడైంది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక