కెన‌డా ఓపెన్ ఛాంపియ‌న్ ల‌క్ష్య‌సేన్

భారత స్టార్ ష‌ట్ల‌ర్ ల‌క్ష్య‌సేన్ సంచ‌ల‌నం సృష్టించాడు. తొలిసారి  కెన‌డా ఓపెన్‌ చాంపియ‌న్‌గా అవ‌త‌రించాడు. పురుషుల సింగిల్స్ ఫైన‌ల్లో ఆల్ ఇంగ్లండ్ చాంపియ‌న్ లో షి ఫెంగ్‌ ని చిత్తు చేసి విజేత‌గా నిలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి  అద్భుత‌మైన ఆట‌తో ల‌క్ష్య‌సేన్ ప్ర‌త్య‌ర్థిని షాక్‌కు గురి చేశాడు. వరల్డ్‌ రాంకింగ్స్‌లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న చైనా ప్లేయర్‌ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 
 
వ‌రుస సెట్ల‌లో జోరు కొన‌సాగించి 21-18, 22-20తో గెలుపొందాడు. ఈ సీజ‌న్‌లో ఈ భార‌త ష‌ట్ల‌ర్‌కు ఇదే తొలి వ‌ర‌ల్డ్ టూర్ టైటిల్‌. మొత్తంగా అతడికి రెండో బీడ‌బ్ల్యూఎఫ్ సూప‌ర్ 500 టైటిల్. నిరుడు జ‌న‌వ‌రిలో ల‌క్ష్య‌సేన్ ఇండియా ఓపెన్ విజేత‌గా నిలిచాడు. 
 
‘ఈ ఏడాది ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావాల‌నుకున్న నాకు ప‌రిస్థితులు క‌లిసి రాలేదు. కెన‌డా ఓపెన్ విజ‌యం నాలో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది. కొన్ని మ్యాచుల్లో ఎక్కువ శ్ర‌మ ప‌డాల్సి వ‌చ్చింది. ప‌రిస్థితులు క‌ష్టంగా ఉండేవి. అయితే.. సిట్యుయేష‌న్‌కు త‌గ్గ‌ట్టు ఆడ‌డం అనేది చాలా ముఖ్యం. కెనడా ఓపెన్‌లో అదే చేశాను’ అని ల‌క్ష్య‌సేన్ మ్యాచ్ అనంత‌రం తెలిపాడు. ప్ర‌స్తుతం ఈ స్టార్ ఆట‌గాడు 19వ ర్యాంక్‌లో ఉన్నాడు.