కేసీఆర్ ను తరిమేసి మోదీ పాలన తీసుకు రావాలి

కేసీఆర్ ను తరిమేసి మోదీ పాలన తీసుకు రావాలి
అవినీతిమయమైన కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర నుండి తరిమేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న మోదీ  పరిపాలన తీసుకురావాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ పిలుపిచ్చారు. ఆదివారం రోజు గద్వాల మండలంలోని బిజెపి జెండా ఆవిష్కరణ సందర్భంగా జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు .
 
జోగులంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం, పరుమాల, కుర్వపల్లి, కాకులరం, సంఘాల, గోన్ పాడు గ్రామాలలో బిజెపి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అరుణ మాట్లాడుతూ కేసీఆర్‌ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో రాబోయేది బిజెపి పార్టీ ప్రభుత్వమేనని ఆమె భరోసా వ్యక్తం చేశారు.
 
దేశంలో, రాష్ట్రంలో ప్రజలు బిజెపి పార్టీ రావాలని కోరుకుంటున్నారని చెబుతూ  రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడని రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. కెసిఆర్ కు రైతుల పై చిత్తశుద్ధి లేదని పేర్కొంటూ ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందని ఆమె ప్రశ్నించారు.
 
ఉచిత ఎరువులని చెప్పి మోసం చేసాడని అంటూ ఎకరాకు రూ. 20వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఇస్తుందని ఆమె చెప్పారు.
రైతులకు సబ్సిడీ లు బంద్ చేసి రైతు బంధు ఇస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  యూరియా మీద దాదాపు రూ. 3000 సబ్సిడీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
 
ఎంతో మంది అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని మొత్తం దోచుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటూ ఆమె విమర్శించారు. దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు ఖర్చు పెట్టే అంత డబ్బు కేసీఆర్‌కు ఎక్కడి నుండి వచ్చిందని అరుణ ప్రశ్నించారు