
తమ దారికి అడ్డొచ్చిన వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. “మా వాగ్నర్ బృందం ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చేసింది. రష్యాలోని రొస్తోవ్ నగరానికి దక్షిణ భాగంలో ఉంది. మా వద్ద 25వేల మంది సైనికులు ఉన్నారు. మేము మాస్కోకు వెళుతున్నాము. మా దారికి అడ్డొస్తే సహించము” అని హెచ్చరించారు. అయితే ఇది సైనిక తిరుగుబాటు కాదని పేర్కొంటూ తమ ఆగ్రహం అంతా రష్యా రక్షణశాఖపైనే అని తెలిపారు.
ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రిగోజిన్ ఓ టెలిగ్రామ్ ఆడియోలో చెప్పినట్టు తెలుస్తోంది. మరి మాట్లాడింది ప్రిగోజిన్ ఏనా? కాదా? అన్నది స్థానిక మీడియాలు ధ్రువీకరించలేకపోయాయి. తాజా పరిణామాలపై రష్యా అధిష్ఠానం అప్రమత్తమైంది. రాత్రికి రాత్రి మాస్కో నగరం అంతటా భారీ ఎత్తున బలగాలు మోహరించినట్టు సమాచారం. తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
“వాగ్నర్ దళాలు ప్రిగోజిన్‌ను నమ్మకూడదు. ఆయనపైనే తిరుగుబాటు చేయాలి. మీరు పుతిన్ ఆదేశాలు పాటించాలి. మీ సొంత స్థావరాలకు వెళ్లిపోవాలి. ఈ పరిస్థితులతో రష్యాకు మంచి జరగదు. రష్యా శత్రువులకు కలిసివస్తుంది. అలా జరగకూడదు. దయచేసి ఆగిపోండి,” అని ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న రష్యా డిప్యూటీ కమాండర్ జనరల్ సెర్గీ సురోవికిన్ వాగ్నర్ దళాలకు సందేశం పంపించారు.
అదే సమయంలో ప్రిగోజిన్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రిగోజిన్ అనే వ్యక్తి, పుతిన్‌కు సన్నిహితుడే. కానీ ఇటీవలి కాలంలో మాస్కోతో ఆయన బంధం బలహీనపడుతూ వచ్చింది. రష్యా అధికారుల చేతకాని తనంతో తమ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అనేకమార్లు అసహనం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి, సాకులు వెతుక్కుని ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో దాడులు చేస్తోందని ఆరోపించారు.
ఉక్రెయిన్‌లోని కీలకమైన బాఖ్ముట్ నగరాన్ని గత నెలలో ఆక్రమించింది వాగ్నర్ బృందం. గత పది నెలల్లో రష్యాకు ఇదే అతిపెద్ద విజయం. అలాంటిది వాగ్నర్ బృందం ఇప్పుడు తమ అస్త్రాలను రష్యాపై ఎక్కుపెడుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది. మరోవైపు రష్యాలోని తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా వెల్లడించింది. ఈ వ్యవహారంపై తమ మిత్రపక్షాలతో చర్చిస్తామని పేర్కొంది.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా