
బందరు ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ.5,156 కోట్ల వ్యయంతో చేపడుతున్న పోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో భూమి పూజ చేశారు. మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మచిలీపట్నం పోర్టు విషయానికి వస్తే 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుందని చెబుతున్నారు. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు.
ఇక, బందర్ పోర్టు నిర్మాణంతో కృష్ణా జిల్లా ముఖచిత్రం మారుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆరు ఓడరేవులు మాత్రమే నిర్మించగా సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో గత నాలుగేళ్లలో నాలుగు కొత్త ఓడరేవుల నిర్మాణాన్ని ప్రారంభించినట్టుగా చెప్పాయి.
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు కు ఇప్పటికే భూసేకరణ చేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఫైనలైజ్ చేసి, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసి పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
మచిలీపట్నం పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారుతుందన్నారు.
More Stories
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం