
ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతంలోని 32 లక్షల మంది ప్రజలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు కృష్ణా-గోదావరి డెల్టా కింద గల తీర ప్రాంతాలన్నీ అత్యధికంగా ముప్పునకు గురయ్యే ప్రాంతాలుగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎంఒఇఎస్)కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కోయిస్) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ రాష్ట్రంలోని 706 గ్రామాలు, ఎనిమిది పట్టణాల్లోని దాదాపు 90 శాతం ప్రాంతం (కోస్టల్ మల్టి-హజార్డ్ జోన్-సిఎంజెడ్) బహుళ ప్రమాదాలు కలిగిన తీరప్రాంత జోన్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. అందువల్ల సముద్రపు కోత కారణంగా ఈ ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యే అవకాశం వుంది.
అంటే ఈ గ్రామాల్లోని 32 లక్షల మంది ప్రజలు, వారి ఆస్తులన్నీ తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. సమీప గ్రామాల్లోని దాదాపు 51లక్షల మంది ప్రజలు పాక్షికంగా బాధితులవుతారు. వారికి ఒక మోస్తరు నుంచి తక్కువ ముప్పు వుంటుంది. తీర ప్రాంత ముంపు వల్ల తూర్పు గోదావరి, నెల్లూరు మధ్య మరినిు తీర ప్రాంత గ్రామాలు ఇటువంటి అనేక ముప్పులను ఎదుర్కొంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సముద్రపు కోత, అవక్షేపాలు పేరుకుపోవడం వంటివి గత 48 సంవత్సరాల్లో (2019 వరకు) ఆందోళన కలిగించే రీతిలో వుననాయని ఇన్కోయిస్ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా డైనమిక్‌గా ఉన్న తీర ప్రక్రియ కారణంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాల్లో 66.3 కిలోమీటర్ల మేర అత్యధిక స్థాయిలో భూమి కోతకుగురైంది.
33.9 కిలోమీటర్లలో ఒక మోస్తరు కోత నమోదైంది, 180.3 కిలోమీటర్ల పొడవునా తక్కువగా భూమి కోతకు గురైంది. నెల్లూరు, విశాఖపటుం మధ్య ఇదంతా చోటు చేసుకుంది. మిగిలిన 662.9 కిలోమీటర్ల పొడవునా గల తీరప్రాంతంలో అవశేషాలు పేరుకుపోయాయి.
సిఎంజెతో కూడిన తీర ప్రాంత గ్రామాల విశ్లేషణ ప్రకారం, 1420 గ్రామాలు, 15 పట్టణాల్లోని 83లక్షల మంది ఈ తీర ప్రాంత ముంపు పరిధిలో ఉన్నారు. తూర్పు గోదావరి (18శాతం), పశ్చిమ గోదావరి (10శాతం), గుంటూరు (11శాతం), కృష్ణా(30శాతం) జిల్లాలు పల్లపు ప్రాంతాల కారణంగా అధికంగా సిఎంజెడ్ ఏరియాను కలిగి వున్నాయి.
More Stories
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం