
త్రిదండి చిన జీయర్ స్వామి గారికి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా స్వామివారిని ఆత్మీయంగా సత్కరించింది.
భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొని, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన చిన జీయర్ స్వామి బుధవారం తిరిగి వచ్చారు. గురువారం విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు వెళ్లి ముచ్చింతల లోని స్వామివారి ఆశ్రమంలో ఆత్మీయంగా కలిశారు.
స్వామి గారి ధార్మిక, సామాజిక సేవను భారత ప్రభుత్వం గుర్తించి అవార్డు అందజేయడం గొప్ప విషయమని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యకారిణి సభ్యులు రాఘవులు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు లక్ష్మి శేఖర్, పగుడాకుల బాలస్వామి, డివిఎస్ఎన్ మూర్తి , పతంజలి ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రావు తదితరులు స్వామీజీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!