
రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి జరిపిన సోదాల్లో నలుగురు మార్గదర్శి ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు మార్గదర్శి ఆడిట్ వ్యవహారాలు చూసిన బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఆడిటర్ శ్రావణ్‌ను కూడా అరెస్ట్ చేసింది సీఐడీ.బ్యాలెన్స్ షీట్ నిర్వహించకపోవడంతో పాటు చిట్ గ్రూప్స్‌కు సంబంధించిన ఫారం 21ను కూడా మార్గదర్శి సంస్థ సమర్పించలేదని సిఐడి ఆరోపిస్తోంది.
మార్గదర్శి సంస్థపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120బి, 477 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణకు హాజరు కావాలంటూ మార్గదర్శి ఎండీ, రామోజీ కోడలు చెరుకూరి శైలజకు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే గత వారం ఆమెను సీఐడీ అధికారుల బృందం విచారించింది. ఇక ఈ కేసులోకి ఈడీ కూడా ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత