మరోవైపు ఎన్సీఈఆర్టీ 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాలను అనుసరించాలని ఉత్తర్ ప్రదేశ్ ఎడ్జ్యుకేషన్ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొఘల్స్ చరిత్రకు సంబంధించిన పాఠాలు ఇక ఉండవు. “మా విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చూసి చదువు చెబుతాము. అందులో ఏముంటే అదే చెప్పాలి కదా,” అని ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాకు వివరించారు.
థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2లో ఉన్న ‘కింగ్ అండ్ క్రానికల్స్: ది మొఘల్ కోర్ట్స్ (సీ.16,17వ శతాబ్దాలు) చాప్టర్లను పూర్తిగా తొలగించింది. హిస్టరీతోపాటు హిందీ, సివిక్స్ పుస్తకాల్లోనూ మార్పులు చేసింది. 10, 11వ తరగతి పుస్తకాల్లోనూ పలు పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని ఎన్సీఈఆర్టీ పేర్కొన్నది.
సీబీఎస్ఈ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ సిలబస్లో దేశంలో సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ‘రైజ్ ఆఫ్ పాప్యులర్ మూమెంట్స్’, స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ పాలనకు చెందిన ‘ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్’ వంటి అధ్యాయాలను తొలగించారు. కాగా, పౌరశాస్త్రము పాఠ్యపుస్తకంలో `అంతర్జాతీయ రాజకీయాలపై అమెరికా ఆధిపత్యం’, `ప్రచ్ఛన్నయుద్ధం కాలం’ అధ్యాయాలను కూడా తొలగించారు.
10, 11వ తరగతుల సిలబస్లలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ‘డెమొక్రసీ అండ్ డైవర్సిటీ’, ‘పాప్యులర్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్’ వంటి పాఠాలను 10వ తరగతి పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తప్పించారు. ‘సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్’, ‘కాన్ఫ్రెంట్రేషన్ ఆఫ్ కల్చర్స్’ వంటి పాఠాలను సీబీఎస్ఈ 11వ తరగతి చరిత్ర పుస్తకాల నుంచి తొలగించారు.
ఇలా ఉండగా, రెండేళ్ల క్రితం దేవాలయాలకు నిధులు సమకూర్చారని అంటూ ముఘల్ రాజులను, ముఖ్యంగా ఔరంగాబాద్, షాజహాన్ లను పొగుడుతూ పాఠ్యపుస్తకాలలో పేర్కొనడాన్ని గురించి సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు కోరగా, తమ వద్ద అందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఎన్సీఈఆర్టీ సమాధానం ఇచ్చింది.

More Stories
గవర్నర్ ను కలిసిన విజయ్ …. రేపే ప్రమాణం!
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!