మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఐర్లాండ్ వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 54 పరుగులు చేసింది.
ఐర్లాండ్ గెలుపు కోసం ఆ సమయానికి చేయాల్సిన స్కోరు 59. దీంతో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది.
ఓపెనర్ స్మృతి మంధాన అర్థ శతకం(87)తో చెలరేగడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది. చివర్లలో జెమీమా రోడ్రిగ్స్ (19) మెరుపులు మెరిపించింది. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు బాదింది. షఫాలీ వర్మ(24), హర్మన్‌ప్రీత్ కౌర్ (13) విఫలం అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో డెలానీ మూడు వికెట్లు, ఒర్లా ప్రెండెర్‌గాస్ట్ రెండు వికెట్లు తీశారు.
కీలకమైన మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మతి మంధాన హాఫ్ సెంచరీ సాధించింది. కారా ముర్రే ఓవర్లో సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 40 బంతుత్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మంధాన అర్థ శతకం బాదింది. ఈ ప్రపంచకప్‌లో మంధానకు ఇది రెండో ఫిఫ్టీ. ఫోర్లు, సిక్సర్లతో ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన మంధాన. నాలుగో వికెట్‌కు జెమీమా రోడ్రిగ్స్‌తో 28 రన్స్ జోడించింది.
అంతకుముందు షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. రెండో వికెట్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, మంధాన 50 రన్స్ జోడించారు. మొదటి వికెట్‌కు షఫాలీ వర్మతో 62 పరుగులు జోడించింది. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఐర్లాండ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోర్ 8 పరుగుల వద్ద టి20ల్లో 3వేల మార్క్‌ను అందుకొని ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం 150 టి20ల్లోనే 3వేల పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు నెలకొల్పింది.
అలాగే మరో 14 టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడితే మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డును బ్రేక్ చేయనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ 2009నుంచి టి20 ప్రపంచకప్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) ఆరంభ సీజన్‌కు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ హర్మన్ ప్రీత్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

More Stories
సరిహద్దులో కొత్త వైమానిక రక్షణ స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ