
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘‘ఖేలో ఇండియా’’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందుకోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని చెబుతూ సమాజానికి ‘‘ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ ముద్దు… పీలో ఇండియా… పీలావో తెలంగాణ వద్దు’’ అని పేర్కొన్నారు.
బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్ర్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ క్రీడల వల్ల మానసిక, శారిరక ఉల్లాసం వస్తుందని చెప్పారు. క్రికెట్ తోపాటు దేశవాళీ క్రీడలను కూడా ప్రోత్సహించాలని సూచించారు.
అంతర్జాతీయ హకీ క్రీడల్లో ఓడిపోయిన మహిళా క్రీడాకారులకు ఫోన్ చేసి ఓదార్చి భరోసా కల్పించిన మోదీ స్పూర్తితో మనం పనిచేయాలని తెలిపారు. బెజ్జంకి మండలాన్ని సిద్ధిపేటలో కలపాలనే ఇక్కడ ప్రజలకు మద్దతు ప్రకటిస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీ లాడ్స్ ఏటా రూ.5 కోట్లు వచ్చేవని, అయితే దురద్రుష్టవశాత్తు కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఆ నిధులే రాలేదని చెప్పారు. ఈసారి ఎంపీ లాడ్స్ నిధుల నుండి కొంత మొత్తాన్ని క్రీడల టోర్నమెంట్ కు కేటాయిస్తానని ప్రకటించారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?