
మహాశివరాత్రి సందర్భంగా సరికొత్త విధంగా హిందువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రదర్శించిన పోస్టర్ పట్ల హిందువులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ బాల శివుడికి పాలు పట్టిస్తున్న ఈ పోస్టర్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ లో ఉంచారు. ఇది హిందువుల మనోభావాలు, ధార్మిక విశ్వాసాలను అవమానపరిచే విధంగా ఉన్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.
పైగా, అన్నార్తుల ఆకలి తీర్చడమే అసలైన ఈశ్వరారాధన అని ఈ ట్వీట్ కు టైటిల్ జోడించడం మరింత వివాదకరంగా మారింది. శివరాత్రి పండుగ నాడు ఈ మాట చెప్పడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. “గుడిలోకి వెళ్లి ఈశ్వరుడికి మీరు మొక్కవలసిన అవసరం లేదు, గుడి బయట ఉండే పేద వాళ్లకు కాసింత పాలు పోస్తే చాలు” అని ముఖ్యమంత్రి జగన్ సందేశం ఇస్తున్నట్లుగా ఉంది. హిందూ ఆలయాలకు వెళ్లకుండా ప్రజలలో ఒక ఆలోచన కలిగించేలాంటి వాక్యంగా పలువురు భావిస్తున్నారు.
అదీగాక, జగన్ పాలు తాగిస్తున్న పసిపాప చేతిలో ఢమరుకాన్ని ఉంచారు. సాక్షాత్తూ శివ స్వరూపానికి జగన్ ఔదార్యంతో పాలు తాగిస్తున్నట్లుగా ఈ బొమ్మ కనిపిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసిన బొమ్మలో ఆలయం మెట్ల మీద నుంచి పాలు వృథాగా కారిపోతున్నట్లుగా చిత్రించారు.
అంటే ఆలయంలో శివుడికి అభిషేకాలు చేసే పాలు అలా వృధాగా పోతుంటాయని, శివుడికి అభిషేకం చేసే బదులుగా పేదవాళ్ళకి ఆకలితో అలమటిస్తున్న వాళ్లకి పాలు తాగించడం మంచిదని తెలియజేసేలాగా ఈ చిత్రంలోని భావం ఉంది. హిందూ దేవుళ్లకు పాలాభిషేకాలు చేసే సాంప్రదాయాన్ని ఎగతాళి చేస్తున్న, తప్పుపడుతున్న తీరుగా ఉందని విమర్శలు చెలరేగుతున్నాయి.
దీని పట్ల హిందువులలో తీవ్ర ఆవేశం వ్యక్తం అవుతుంది. భగవంతుడికి చేసే అభిషేకాలు దండగ అని చెప్పడానికి ఈ క్రైస్తవ ముఖ్యమంత్రి ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలయం బయట శివుడి వాహనమైన ఎద్దును కూడా చిత్రీకరించారు. హిందుత్వానికి సంకేతంగా దానిమీద ఒక కాషాయ వస్త్రాన్ని కూడా కప్పారు.
ఈ ఎద్దు నంది స్వరూపం అనుకుంటే, ఆ నందికి వైష్ణవ చిహ్నమైన నిలువు నామాలు పెట్టడం తీవ్రమైన వివాదానికి దారితీస్తోంది. శివుడి వాహనానికి విష్ణు నామాలు పెట్టడం శైవాన్ని అవమానించడమే కాకుండా పరస్పరం విద్వేషాలు రగిల్చే ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు.
కాగా, ఈ పోస్టర్ ను వెంటనే తొలగించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ట్విట్టర్‌లో హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా. ఈ రోజు 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సోమువీర్రాజు తెలిపారు. వైసీపీ పార్టీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి