వినూత్న కమ్యూనికేషన్ వ్యూహాల ద్వారా ఓటర్ల శాతాన్ని పెంచే లక్ష్యంతో ఈ ఏడాది తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్ సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా సుభాష్ ఘాయ్ ఫౌండేషన్ సహకారంతో ఈసీఐ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ‘మై భారత్ హూం, హమ్ భారత్ కే మత్తతా హై’ అనే పాటను రూపొందించి ఓటు హక్కు వినియోగించుకోవాలని, రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.
13వ జాతీయ ఓటరు దినోత్సవం (ఎన్ వీడీ) – 2023 జనవరి 25న రాష్ట్రపతి సమక్షంలో ప్రదర్శించిన ఈ పాట ఇప్పటికే ప్రముఖులు,ప్రజలను ప్రభావిత ఉన్న శక్తి కలిగిన వారి సహకారంతో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా గుర్తింపు పొందింది. హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో రూపొందిన పాట విడుదలైన వారం రోజుల్లోనే పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి నాలుగు ప్రధాన సోషల్ మీడియాల్లో 3.5 లక్షల వ్యూస్, 5.6 లక్షల ఇంప్రెషన్స్ పొందింది.
‘ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అన్న నినాదం కార్యరూపం దాల్చేలా చూడడానికి కేంద్ర ఎన్నికల సంఘం ‘సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమం రూపొందించింది. ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు ఈసీఐ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
దీనిలో భాగంగా ‘మై భారత్ హూం, హమ్ భారత్ కే మత్తతా హై’ పాటను ఈసీఐ సిద్ధం చేసింది. . ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటర్లకు తమ హక్కులు, బాధ్యత గురించి అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు ఆయేలా చూడాలన్న లక్ష్యంతో పాటను ఈసీఐ రూపొందించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘంతో సుభాష్ ఘాయ్ నేతృత్వంలోని బృందం అనేకసార్లు చర్చలు జరిపిన తరువాత పాటకు తుది రూపు ఇచ్చారు. చర్చల్లో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ “జాతీయ కర్తవ్యాన్ని గుర్తించి అన్ని అడ్డంకులను అధిగమించి ఓటు వేసే ప్రతి ఓటరుకు ఈ పాటను అంకితం చేస్తున్నాము. కొత్గా ఓటు హక్కు పొందిన వారిని, భావి ఓటర్లను, యువ ఓటర్లు,సర్వీస్ ఓటర్లు, దివ్యాంగ ఓటర్లకు అవగాహన కల్పించి, 100 సంవత్సరాల వయస్సు గల ఓటర్ల ఆకాంక్షలు ప్రతిబింబించేలా పాట రూపొందింది” అని తెలిపారు.
ప్రజాస్వామ్యంపై విశ్వాసం చూపి 2019 ఎన్నికల్లో పురుషులను మించి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్లను కీర్తిస్తూ పాట సాగుతుంది. భారతదేశ వైవిధ్యం, భౌగోళిక అంశాల ప్రాధాన్యత తెలియజేసే విధంగా ‘ఓటుకు మించింది లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’ అని ప్రతి ఓటరును చైతన్యం చేయాలన్న ఎన్నికల సంఘం లక్ష్యం సాధనకు పాట సహకరిస్తుందని ఆయన వివరించారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు