అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. గతవారం చెప్పినట్లుగానే అమెరికాలో టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ లావాదేవీలు అన్నింటిని నిషేధిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిబంధన వచ్చే 45 రోజుల్లో అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ఆయన జారీ చేశారు. టిక్ టాక్ తో పాటు వుయ్ చాట్ పైనా అమెరికా నిషేధం విధించింది.
అమెరికా నిబంధనల ప్రకారం టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో పాటు వుయ్ చాట్ పై కూడా నిషేధం విధిస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ నాయకులకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. చైనాకు సంబంధించిన యాప్ లను వివిధ దేశాలు ఒక్కొక్కటిగా నిషేధిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో చైనాకు చెందిన చాలా యాప్స్ లు నిషేధానికి గురయ్యాయి.

More Stories
డెన్మార్క్తోనే కొనసాగుతాం.. గ్రీన్లాండ్ ప్రధాని స్పష్టం
లండన్ లో 14 ఏళ్ల సిక్కు బాలికపై పాక్ గ్యాంగ్ అత్యాచారం
ఇరాన్లో భారతీయులు వెంటనే ఆ దేశాన్ని విడిచి రావాలి