
భారతదేశపు గొప్ప సంస్కృతి, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకై చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను రైలు మార్గం ద్వారా అనుసంధానం చేసే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ భారత్ గౌరవ్ రైలు సర్వీస్ ను ప్రారంభించింది. తద్వారా దక్షిణ మధ్య రైల్వే జోన్ అంతటా ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి .
ఇందుకు సంబందించి దక్షిణ మధ్య రైల్వే సహకారంతో భారత్ గౌరవ్ రైళ్లను నడిపేందుకై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐ. ఆర్ .సి. టి. సి) మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా నమోదు చేసుకుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయంలో దీనికి సంబంధించి అధికారిక సమావేశం నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి. జాన్ ప్రసాద్ కు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్ ధనంజయులు సమక్షంలో రూ. ఒక కోటి రూపాయల బ్యాంకు పూచికత్తును ఐ ఆర్ సి టి సి జిజిఎం డి. నరసింగరావు అందజేశారు. శ్రీమతి పద్మజ, చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్యాసింజర్ సర్వీసెస్), డి .సత్యనారాయణ, చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ కుడా ఈ సమావేశంలో పాల్గొన్నారు .
దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం నిరంతరం కృషిచేసి భారత్ గౌరవ్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వేలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. తదనుగుణంగా భారత్ గౌరవ్ రైళ్ల ద్వారా జోన్ లోని పర్యాటక ప్రాంతలను సందర్శించే పర్యాటకులకు కలిగే ప్రయోజనాల గురించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు.
అనేక చారిత్రక, పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలనుకునే రైలు ప్రయాణీకులకు భారత్ గౌరవ్ రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రైళ్లను నడపడం వల్ల ఐ. ఆర్ .సి. టి. సి కి, అలాగే రైల్వేలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ అంశంలో ఐ. ఆర్ .సి. టి. సి అత్యంత ఆసక్తిని కనబరిచి దక్షిణ మధ్య రైల్వే నుండి భారత్ గౌరవ్ రైలు సర్వీస్‌లను నడపడానికి ముందుకు వచ్చింది.
భారత్ గౌరవ్ పథకం వ్యక్తిగతంగా,, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, సొసైటీ, ట్రస్ట్, జాయింట్ వెంచర్లు, పెట్టుబడులు పెట్టే వారు సర్వీస్ ప్రొవైడర్‌గా ఆన్లైన్లో www.indianrailways.gov.in సైట్ ద్వారా నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించింది . రిజిస్ట్రేషన్ అనంతరం కావాల్సిన బోగీలను కావాల్సిన రీతిలో పేర్కొంటూ ఆన్లైన్ డిమాండ్‌ను ఉంచవచ్చు. దీనితో పాటు రూ.కోటి రూపాయల బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి