ప్రపంచంలో దేశ గౌరవాన్ని పెంచిన ఎన్నికల కమీషన్ 

ప్రపంచంలో దేశ గౌరవాన్ని పెంచిన ఎన్నికల కమీషన్ 
ఎన్నిక‌లు నిర్వ‌హించే సంప్ర‌దాయాన్ని అభివృద్ధి చేసి ప్ర‌పంచంలో మ‌న దేశ గౌర‌వాన్ని ఎన్నికల క‌మిష‌న్ పెంచింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు. నేడు ఆయ‌న  అహ్మదాబాద్‌లో ఆయన ఓటు వేశారు. ఆ తర్వాత ఆయన పోలింగ్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న తన అన్న సోమా మోదీ  ఇంటికి వెళ్లారు. 
 
అహ్మదాబాద్ లోని రానిప్ ఉన్నత పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ  ఓటేసేందుకు వెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రంలో సిబ్బంది ప్రధాని రాగానే లేచి నిల్చున్నారు.  వారిని కూర్చోమని మోదీ  చెప్పారు.  అనంతరం పోలింగ్ బూత్ లో ఓటేసిన మోదీ   బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా చుక్క ఉన్న వేలును చూపించారు.
 
ప్రజాస్వామ్య పర్వదిన వేడుకలు చేసుకుంటున్న ఓటర్లకు, ఎన్నికల సంఘానికి ఆయన అభినందనలు తెలిపారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో ఈ ప్రజాస్వామ్య పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో నిర్వహించుకున్నారని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఈ ప్రజాస్వామ్య వేడుక జరుపుకుంటున్న దేశ ప్రజలను తాను అభినందిస్తున్నట్టు వివరించారు. ఎంతో ప్రభావవంతంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్‌కూ అతను శుభాకాంక్షలు చెప్పారు. గుజరాత్ ప్రజలు విచక్షణ కలిగినవారని న్నారు. వారు అందరి మాటలూ వింటారని, ఏది నిజమో దాన్నే గ్రహిస్తారని వివరించారు.
 
 ఇక్కడి వాతావరణం చూస్తుంటే చాలా మంది ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు అర్థం అవుతున్నదని చెప్పారు. గుజరాత్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ ఎన్నికల రెండో దశలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
అహ్మదాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అతని కొడుకు జైషా ఓటు వేశారు. ప్రధాని తల్లి హీరాబెన్, సోదరుడు సోమాభాయ్ మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నరేంద్ర మోదీ సోదరుడు పంకజ్ మోదీ తోడురాగా ఆమె వీల్ చెయిర్‌పై ఓటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. . వందేళ్ల వయసులోనూ ఓటేసేందుకు ఉత్సాహంగా వచ్చిన హీరాబెన్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. యూపీ గవర్నర్ ఆనంది బెన్, బిజెపి  అభ్యర్థి హార్దిక్ పటేల్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఓటు వేశారు