జిడిపి జీరోగా మారినా సంతోష సూచిలో ఎక్కువ  

జిడిపి జీరోగా మారినా సంతోష సూచిలో ఎక్కువ  

భారతదేశ జిడిపి జీరోగా మారినప్పటికీ, సంతోష సూచిలో మనం ఇంకా చాలా ఎక్కువగా ఉంటామని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యకారిణి సభ్యుడు  డా. ఇంద్రేశ్ కుమార్ స్పష్టం చేశారు. భారతదేశంతో వాణిజ్యాన్ని కేవలం భారత కరెన్సీలో మాత్రమే జరపాలనే నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్ కు దారితీస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.  ప్రపంచంలోని వినియోగదారుల మార్కెట్‌లో భారతదేశం 40 శాతంలోనే ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు.

75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా, ఫోరమ్ ఫర్ నేషనల్ అవేర్‌నెస్ అండ్ సెక్యూరిటీ (ఎఫ్ఎఎన్ఎస్) ఆధ్వర్యంలో జామియా హమ్దార్ద్ (యూనివర్శిటీ), న్యూఢిల్లీ సహకారంతో. ‘ఏక్ భారత్! ఆత్మనిర్భర్ భారత్! శ్రేష్ఠ భారత్!!!’ అంశంపై జరిగిన హకీమ్ అబ్దుల్ హమీద్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ప్రసంగం చేశారు.

 ప్రపంచంలో భారత్ వంటి ప్రజాస్వామ్యం లేదని చెబుతూ ఇది శాశ్వతంగా కొనసాగడానికి మనమంతా ఐక్యంగా ఉండాలని తెలిపారు. వినియోగదారు వస్తువులతో పాటు, మనకు మంచి నైతిక విలువలు, ఆదర్శవాదం అవసరమని, తద్వారా వ్యక్తి, కుటుంబం,  జాతీయ స్థాయిలో గౌరవం లభిస్తుందని ఆయన చెప్పారు.

అనేక భారతీయ పండుగలు, తీర్థయాత్రలు, జాతరలు, కార్నివాల్‌లు భారతదేశ ఆర్థిక వ్యవస్థ శాశ్వతత్వాన్ని నిర్ధారిస్తాయని చెప్పారు. ప్రపంచంలోని అన్ని మత గ్రంధాలు దయ, వినయపూర్వకంగా ఉండాలని, కఠినంగా ఉండకూడదని, ప్రేమ, శాంతి, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

మన దేశానికి మౌలిక విలువలైన  సమాజం, మానవత్వం, సౌభ్రాతృత్వంలను  ఇస్లాంలో కూడా ప్రతిపాదించిన విలువలు అని ఆయన గుర్తు చేశారు.  దేశం పట్ల ప్రేమ, నిబద్ధత, అంకితభావంతో ఒకరు భూమిపై శాంతిని పొందడంతోపాటు మరణానంతరం స్వర్గంలో స్థానం పొందేలా చేస్తుందని ఆయన తెలిపారు. డిఎన్ఎ కు తన సొంత భాష్యం చెబుతూ ఈ మూడు ఆంగ్ల అక్షరాలు కలలు, సొంత దేశం, పూర్వీకులను సూచిస్తాయని వివరించారు.

భారతీయులంగా మనం సాధారణ భాష అయినా హిందుస్తానీలో కలలు కంటున్నామని ఈ వివరణ వెల్లడిస్తోంది చెప్పారు. మన ముఖాలు, పేర్లు మనం భారతీయులం అని సూచిస్తాయని పేర్కొన్నారు. అవి మన భారతీయ మూలాలు, మన పూర్వుల నుండి సంక్రమించిన సంప్రదాయాలను సూచిస్తాయని తెలిపారు.  భారతీయ మూలాలకు ఉదాహరణ బ్రిటన్ ప్రస్తుత ప్రధాన మంత్రి రిషి సునక్ అని ఇంద్రేశ్ కుమార్ గుర్తు చేశారు.

మైనారిటీ విద్యా సంస్థల జాతీయ కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్  షాహిద్ అఖ్తర్ ప్రత్యేక అతిధిగా పాల్గొంటూ దేశంలోని మైనారిటీ విద్యాసంస్థలు మన దేశ ఐక్యత స్ఫూర్తికి  ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో గొప్ప పురోగతిని సాధిస్తున్నారని చెప్పారు. ఇది వారి

జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్  మొహమ్మద్అఫ్సర్ ఆలం అధ్యక్షత వహిస్తూ స్పష్టమైన భారతీయ భిన్నత్వంలో అనూహ్యమైన ఐకమత్యం కనిపిస్తోందని తెలిపారు.  భారతదేశ సంస్కృతి. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నినాదమైన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదాన్ని అనుసరించాలని చెబుతూ ఇది కేవలం సాంస్కృతిక జాతీయవాదం కోసమే  కాకుండా, జాతీయ భద్రతకు సహితం అవసరం అని స్పష్టం చేశారు.

ఎఫ్ఎఎన్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం)  గోలోక్ బిహారీ రాయ్ తొలుత స్వాగతం పలుకుతూ ఆజాదే కా అమృత మహోత్సవ్ దేశానికి ఒక వేడుకగా మాత్రమే కాకుండా, రాబోయే 25 సంవత్సరాలలో దేశానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి, అమలు చేయడానికి కూడా దిక్చుచిగా కూడా ఉండాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా మానవళి మనుగడకు భారత దేశం అవసరమని ఆయన తెలిపారు.