
ఈ నేపథ్యంలో 2019లో ఆజం ఖాన్‌పై నమోదైన కేసుపై రాంపూర్ కోర్టు విచారణ జరిపింది. ఎట్టకేలకు గురువారం తీర్పు ఇచ్చింది. ఆయనను దోషిగా నిర్ధారించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, 2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై 90కు పైగా కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణ కేసులో అరెస్టైన ఆయన రెండేళ్లపాటు జైలులో ఉన్నారు. జైలు నుంచే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈ ఏడాది మేలో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆజం ఖాన్ తెలిపారు. విద్వేషపూరిత ప్రసంగాలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని, ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరిన వారం తర్వాత ఆజంఖాన్ కు ఈమేరకు శిక్షపడింది.
రాంపూర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల్లో బలమైన అనుచరులను కలిగి ఉన్న ఆజంఖాన్ కు సమాజ్ వాదీ పార్టీలో బలమైన నాయకుడిగా పేరుంది. అఖిలేష్ యాదవ్ తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ సంపాదించుకున్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు