
“రెండవ అయోధ్య”గా పిలుచుకునే భద్రాచలం రాములవారికి అన్యాయం జరుగుతోంది. న్యాయమైన రాములవారి ఆస్తులను ఆక్రమించేందుకు దుష్టశక్తులు విఫల యత్నం చేస్తున్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న రాములవారి మందిరం, ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉంది.
క్రైస్తవ మతానికి చెందిన వాళ్లు దౌర్జన్యంగా భూములను ఆక్రమిస్తుంటే, ప్రజాస్వామ్య రీతిలో అడిగేందుకు వెళ్లిన ఎండోమెంట్ అధికారులపై బూతుల పర్వం, భౌతిక దాడులు చేసిన సంఘటనలు ఘోరం. ఇంత జరుగుతున్నా పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి అరాచకం..!
ఆస్తులకు సంబంధించిన భూముల రికార్డుల విషయంలో స్పందించాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారులు, అక్కడి పోలీసు యంత్రాంగం ఏ మాత్రం స్పందించడం లేదు. దీంతో ఈ రెండు మూడు రోజుల్లోనే దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాముల వారి గోషాలను కూడా యధేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు.
గోశాల చుట్టూ జెసిబిలతో కందకాలు తవ్వుతున్నారు. ప్రస్తుతం మనం గోశాల లోపలికి వెళ్లాలన్నా, గోశాలలోని గోవులు బయటకి రావాలన్నా వీలు లేకుండా చుట్టూ జెసిబిల సహాయంతో తవ్వేశారు. ఇప్పుడు గోశాలలోకి వెళ్లాలంటే హెలికాప్టర్ తో గాలిలో నుంచి ఎగరాల్సిందే తప్ప వేరే మార్గం లేదు.!
దేవాలయాల స్థలాలలో అనుమతి లేకుండా రేయింబవళ్లు ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అండదండలతోనే జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి రామభక్తుడు ప్రతి హిందువు కులాలకు పార్టీలకు అతీతంగా స్పందించి, రాములవారి ఆస్తులను, రాముల వారి అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
ఇదే విషయమై న్యాయబద్ధంగా పోరాడుతూనే, రెండవ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రాముల వారి ఆస్తుల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ (VHP) ముందుకు వస్తోంది. వాస్తవ విషయాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం భద్రాచలం సందర్శించనుంది.
అక్కడి అధికారులతో మాట్లాడి, జరుగుతున్న నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. రాములవారి అస్తిత్వం, ఆస్తి కాపాడుకునే ఈ యజ్ఞంలో ప్రతి రామ భక్తుడు, ప్రతి హిందువు పాల్గొనవలసిందిగా విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం పలుకుతోంది.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!