
ఆయుష్ రంగంలో అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య విద్య నేటితరం వాస్తవికతగా మారిందని ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ కాళూభాయ్ తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ దీనికి తోడ్పాటు నిస్తుందని ఆయన చెప్పారు.
గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ తన కేంద్ర ప్రాయోజిత పథకం జాతీయ ఆయుష్ మిషన్ (నామ్) కింద గుజరాత్ ప్రభుత్వం అత్యాధునిక ఆయుష్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిస్తోందని హామీ ఇచ్చారు.
మన సాంప్రదాయ ఔషధ వ్యవస్థలు ప్రభావవంతమైనవి, ఇవి యుగాల నుండి ఆచరించబడుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మన ప్రధానమంత్రి కృషి వల్లనే జామ్‌నగర్‌లో డబ్లూ హెచ్ ఓ జీ సీ టీ ఎం స్థాపించినట్లు చెప్పారు. గుజరాత్లో ఐదు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయని చెబుతూ ఇప్పుడు ఆరవదాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇది విద్యార్థులకు మరియు స్థానిక సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఆయుష్ ప్రధాన సామర్థ్య రంగాలపై దృష్టి సారించడం ద్వారా దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సిహెచ్‌సిలు), జిల్లా ఆసుపత్రులలో (డిహెచ్లు) ఆయుష్ సౌకర్యాలను కల్పించే వ్యూహాన్ని అనుసరించిందని వివరించారు. తద్వారా ఒకే భవనంలో మందులు రోగులకు వివిధ వైద్య వ్యవస్థల నుండి ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు.
More Stories
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి
ఎవరెస్ట్‌పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ