కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. 16వ తేదీ రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 17వ తేదీ ఉదయం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
8.45 నుంచి 11.45 వరకు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. విమోచన దినోత్సవం రోజంతా హైదరాబాదులోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు.
తర్వాత పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజాకు చేరుకుని పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారు. మళ్ళీ సాయంత్రం పోలీస్ అకాడమీకి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7.30కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

More Stories
హైదరాబాద్‌పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు