
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద పీఎం కిసాన్ నిధులు పొందడానికి రైతులు ఈకేవైసీ చేసుకోవడానికి మూడు రోజులే గడవు ఉందని కేంద్రం పేర్కొంది. పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందే రైతులు ఆగస్టు 31వతేదీలోగా ఈకేవైసీ ఫార్మాలిటీని పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది.
పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గతంలో జులై 31వతేదీ చివరి తేదీ అని ప్రకటించింది. ఈ గడవును ఆగస్టు 31వతేదీ వరకు పొడిగించింది. పీఎం కిసాన్ పోర్టల్ లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్న రైతులు ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని కేంద్రం కోరింది. లేదా రైతులు వారి సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ చేయించుకోవచ్చని కేంద్ర అధికారులు సలహా ఇచ్చారు.
ఆధార్ నంబరు సాయంతో ఓటీపీ బేస్ డ్ ఈకేవైసీ చేయించుకునే రైతులు ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయవచ్చు.https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx. రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి రైతుల కార్నర్ ద్వారా ఈకేవైసీ ట్యాబ్ ను క్లిక్ చేయవచ్చు.రైతులు వారి ఆధార్ నంబరును ట్యాబ్ లో సెర్చ్ చేసి మీ మొబైల్ నంబరుకు వచ్చే నాలుగు అంకెల డిజిట్ ఓటీపీని సబ్ మిట్ చేయాలి.
ఆధార్ నంబర్, ఓటీపీ సబ్ మిట్ చేస్తే ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు రెండు వేల రూపాయల ఇన్ స్టాల్ మెంట్ వారి ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. 2019వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద 10 కోట్ల మంది రైతులకు రూ.21,000కోట్లను మే 31వ తేదీన వారి ఖాతాల్లో జమ చేశారు.
More Stories
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి
ఎవరెస్ట్‌పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ