
కశ్మీర్లో విద్రోహక చర్యలకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎ్‌సఐ మళ్లీ ఉగ్రవాద సంస్థలను ఉసిగొల్పుతోంది. ఇంత కాలం నిధుల కొరత, పశ్చిమ దేశాలు, అగ్రరాజ్యాల ఆంక్షలు, ఐరాస భద్రతా మండలి ఆంక్షలతో కొంత వెనక్కి తగ్గిన ఐఎ్‌సఐ ‘మిషన్ కశ్మీర్’ను మళ్లీ ప్రారంభించిందని ఆ సంస్థ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు.
గత మంగళవారం ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో పలు విషయాలను పంచుకుంటూ ఇస్లామిక్ స్టేట్ విలాయహ్ హింద్ (ఐఎ్సహెచ్పీ) అనే కొత్త ఉగ్రవాద సంస్థ వివరాలు అందించిన సదరు మాజీ అధికారి తాజాగా \పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో కొనసాగుతున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాల గురించి వివరాలు అందించారు.
పీవోకేలోని మాన్షేరా, ముజఫరాబాద్, కోట్లీల్లో మూడు క్లస్టర్లుగా ఉగ్రవాద శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని ఆ మాజీ అధికారి వివరించారు. వీటిని లష్కర్-ఎ-తాయిబా (ఎల్ఈటీ), జైష్-ఎ-మహమ్మద్(జేఈఎం), అల్-బదార్ అండ్ హర్కత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు నిర్వహిస్తున్నాయి.
ఈ శిబిరాల నిర్వహణకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అందజేస్తోంది. వీటి నిర్వహణ, శిక్షణ పొందిన ఉగ్రవాదుల వినియోగంలో ఐఎ్సహెచ్పీది కీలక పాత్ర. మన్షేరా క్లస్టర్లో బోయ్, బాలాకోట్, గార్హీ హబీబుల్లా ప్రాంతాల్లో మూడు శిబిరాలున్నాయి. ముజఫరాబాద్ క్లస్టర్‌లోని చెలంబండి, షావాయ్నాలా, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయ్ ప్రాంతాల్లో మొత్తం నాలుగు ఉగ్రవాద శిబిరాలు కొనసాగుతున్నాయి.
కోట్లీ క్లస్టర్‌లోని సేన్సా, కోట్లీ, గుల్పూర్, ఫాగోష్, దుబ్గీ ప్రాంతాల్లో ఐదు శిబిరాల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని ఆ అధికారి వెల్లడించారు. ఈ శిబిరాల్లో యువతకు ఉగ్రవాద శిక్షణ, ఆయుధాల వినియోగం, ఆత్మాహుతి దాడులపై శిక్షణనిస్తారని, ఇక్కడ శిక్షణ పొందినవారు శీతాకాలంలో ఎల్వోసీ దాటేందుకు సిద్ధమవుతారని పేర్కొన్నారు.
ఈ శిక్షణ శిబిరాలన్నీ ఎల్వోసీకి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని తెలిపారు. ‘‘శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో ఉండే ఐఎస్ఐ ఏజెంట్ల (ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ – ఓజీడబ్ల్యూ) నుంచి వీరికి ఆయుధాలు సమకూరుతాయి. ఓజీడబ్ల్యూలకు డ్రోన్ల ద్వారా పాక్ నుంచి ఆయుధాలు అందుతాయని వివరించారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు