
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్ 2021 ఫలితాల్లో 21 తెలుగు అభ్యర్థులు ఎంపికయి తమ సత్తా చాటారు. యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంక్, పూసపాటి సాహిత్య 24వ ర్యాంక్, మంత్రి మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంక్ సాధించారు.
కె.కిరణ్మయి 56వ ర్యాంక్, శ్రీపూజ 62వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69వ ర్యాంకు, ఆకునూరి నరేశ్ 117వ ర్యాంకు, అరుగుల స్నేహ 136వ ర్యాంకు, బి చైతన్య రెడ్డి 161వ ర్యాంకు, ఎస్.కమలేశ్వర్ రావు 297వ ర్యాంకు, విద్యామరి శ్రీధర్ 336వ ర్యాంకు, దిబ్బడ ఎస్వీ అశోక్ 350వ ర్యాంకు, శరత్ నాయక్ 374వ ర్యాంక్ లభించాయి.
నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు, ఉప్పులూరి చైతన్య 470వ ర్యాంకు, మన్యాల అనిరుధ్ 564వ ర్యాంకు, బిడ్డి అఖిల్ 566వ ర్యాంకు, రంజిత్‌కుమార్ 574వ ర్యాంకు, పాండు విల్సన్ 602వ ర్యాంకు, బాణావత్ అరవింద్ 623వ ర్యాంకు, బచ్చు స్మరణ్ రాజ్ 676వ ర్యాంకు ను కైవసం చేసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాసింపల్లె కు చెందిన ఆకునూరి నరేష్ కు సివిల్స్ లో ఆలిండియా 117 వ ర్యాంక్ వచ్చింది. వరంగల్ జిల్లా కు చెందిన బొక్క చైతన్య రెడ్డికి 161 వ ర్యాంకు వచ్చింది. ఈమె తండ్రి బి.సoజీవ రెడ్డి గతంలో వరంగల్ డీసీఓగా పని చేశారు. ప్రస్తుతం సాగునీటి శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చైతన్యరెడ్డి పనిచేస్తున్నారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన శరత్ నాయక్ కు సివిల్స్ లో 374 వ ర్యాంకు వచ్చింది. తండ్రి భాష్యనాయక్ వ్యవసాయం చేస్తుండగా తల్లి యమున మినీ అంగన్వాడీ కార్యకర్త గా సేవలందిస్తున్నారు.
సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. మొదటి నాలుగు ర్యాంకులు మహిళలకే దక్కడం విశేషం. సివిల్స్‌లో శ్రుతి శర్మకు ఆలిండియా నెంబర్-1 ర్యాంక్, అంకిత అగర్వాల్ రెండవ ర్యాంక్, గామిని సింగ్లా మూడో ర్యాంకు సాధించారు.
జనరల్ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది, 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికయ్యారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి