
ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ని గెలుచుకుని చరిత్రని సృష్టించారు ప్రముఖ హిందీ నవలా రచయిత గీతాంజలి శ్రీ. సాహిత్యంలో అత్యుత్తమ నవలను ఎంపిక చేసి ఈ ప్రైజ్ ని ఏటా ప్రకటిస్తుంటారు. ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను ఈ ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వరించింది.
భారతీయ భాషలలో అవార్డు గెలుచుకున్న మొదటి పుస్తకంగా ఇది రికార్డు నమోదు చేసింది. ఈ హిందీ నవలను ఇంగ్లిష్ లోకి అనువదించిన అమెరికా అనువాదకురాలు డైసీ రాక్ వెల్ తో సంయుక్తంగా బుకర్ ప్రైజ్ ను గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు.
టూంబ్ ఆఫ్ శాండ్ పుస్తకాన్ని ‘బలమైన వాదాన్ని వినిపించే ఎదురేలేని నవల’గా అవార్డు న్యాయ నిర్ణేతలు అభివర్ణించారు. అవార్డుతో పాటు 50,000 పౌండ్లను విజేతలకు అందిస్తారు. ఉత్తరప్రదేశ్ మెయిన్ పురిలో జన్మించి, ఢిల్లీలో పెరిగిన గీతాంజలిశ్రీ (64) మూడు నవలలు, పలు కథలను ఇప్పటి వరకు రాశారు.
బ్రిటన్ లో పబ్లిష్ అవుతున్న ఆమె తొలి పుస్తకం టూంబ్ ఆఫ్ శాండ్. భారత దేశం, దాని విభజన ఇతివృత్తం ఆధారంగా ఈ నవలను వ్రాసారు. 2000లో మాయ్ అనే పుస్తకం రాయగా, ఇది క్రాస్ వర్డ్ బుక్ అవార్డుకు ఎంపికైంది. గతంలో పలు అవార్డులు సైతం ఆమెను వరించాయి. టూంబ్ ఆఫ్ శాండ్ 2018లో హిందీలో ప్రచురితమైంది. అంటే బుకర్ ప్రైజ్ కు ఎంపికైన తొలి హిందీ పుస్తకం ఇదే కానుంది.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం