
గత ఆరేళ్లలో భారత్ మొదటిసారిగా చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఏడాది ఎగుమతులను 10 మిలియన్ టన్నులకు పరిమితం చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ప్రపంచ మార్కెట్‌లో మిల్లులు రికార్డు స్థాయిలో చక్కెరను విక్రయించడంతో దేశీయంగా ధరలు పెరగకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్థానిక ధరలపై పరిమితి విధించేందుకు, దేశీయ మార్కెట్‌లో స్థిరమైన సరఫరాలను నిర్థారించడానికి భారత్ చక్కెర ఎగుమతులను నియంత్రించేందుకు యత్నిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది. జూన్ 1 నుండి అక్టోబర్ 1 మధ్య విదేశాలకు సరుకు రవాణా చేసేందుకు అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. భారతదేశ నిర్ణయంతో లండన్‌లో చక్కెర ధరలు 1శాతం కంటే అధికంగా పెరిగాయి.
గత ఏడాది కాలంగా దేశీయ మార్కెట్ లో చక్కర ధరలు స్థిరంగా ఉండేటట్లు చేయగలిగామని చెబుతూ అక్టోబర్ – నవంబర్ మాసాలలో పండుగల సీజన్లో లో స్థానిక వినియోగదారులకు తగినంద చక్కర అందుబాటులో ఉండేవిధంగా చూడటం కోసం ఈ చర్య అనివార్యమైనదని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.
ఇతర నిత్యావసర వస్తువులతో పోల్చుకొంటే దేశంలో చక్కర ధరలు స్థిరంగానే ఉన్నాయని చెబుతూ అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన కొరతలు సాకుగా తీసుకొని దేశంలో ధరలు పెరిగేటట్లు చేయకుండా నిరోధించడం కోసం ఈ చర్య తీసుకున్నామని చెప్పారు.
భారత దేశంలో చక్కర ఎగుమతులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయని చెబుతూ 2016-17లో 50,000 టన్నులు మాత్రమే ఉండగా ఈ సంవత్సరం కోటి టన్నులకు పెరిగాయని ఆయన వెల్లడించారు. అయితే ఎగుమతులను అడ్డుకోవడం లేదని స్పష్టం చేస్తూ ఇప్పటికే 9 మెట్రిక్ టన్నుల ఎగుమతులకు ఒప్పందాలు జరిగాయని, వాటిల్లో 7.5 మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరిగాయని వివరించారు. ఒక విధంగా ఇవి రికార్డు స్థాయి ఎగుమతులు అని తెలిపారు.
ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, వచ్చే పండుగ సీజన్‌కు సరిపడా చక్కెర నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటుందని ముంబయికి చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ డీలర్ ఒకరు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు, బ్రెజిల్ తర్వాత రెండవ అతిపెద్ద ఎగుమతిదారు.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ