పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం రైల్వే శాఖ ఓ కొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. అదే ఫోల్డబుల్ బేబీ బెర్త్. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడక ఇది. లోయర్ బెర్త్‌కు అటాచ్ అయి ఉంటుంది.
ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్‌పై తమ శిశువులను పడుకోబెట్ట వచ్చు. సాధారణంగా అయితే ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డ సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక ఇబ్బందులు తప్పేవి కావు. ఇప్పుడు బేబీ బెర్త్ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టవచ్చు.
మాతృదినోత్సవం సందర్భంగా ఉత్తర రైల్వే మండలం ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటు లోకి తీసుకురావడం విశేషం. లఖ్‌నవూ, ఢిల్లీ డివిజన్ల సమన్వయంతో లఖ్‌నవూ డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ బేబీబెర్త్‌ను మెయిన్ లోయర్ బెర్త్‌తో జత చేశామని చెప్పారు.
అవసరం లేనప్పుడు దీన్ని లోయర్ బెర్త్ కిందకి మడత బెట్టొచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం అని ఆయన వివరించారు. 770 మిమీ పొడవు, 225 మిమీ వెడల్పు, 76.2 మిమీ ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి పట్టీలూ ఉన్నాయని చెప్పారు.
భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటి పిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లీబిడ్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కారం చూపలేకపోయారు. అయితే తొలిసారిగా నార్నర్ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు.

More Stories
అదానీ గ్రూప్ లో పెట్టుబడులకై ఎలాంటి ఒత్తిళ్లు లేవు
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’