
దేశంలో వివాదం, పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీసిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను మరోసారి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్థించుకుంది. ఈ చట్టం గురించి ఓ వార్షిక నివేదిక లో ఈ చట్టం రూపొందించడానికి వివరణనిస్తూ.. ఇది సరైందేనని సమర్థించుకుంది.
సిఎఎను కొన్ని కారణాలతో రూపొందించినట్లు పేర్కొంది. ఈ చట్టం పరిమితితో, జాగ్రత్తగా రూపొందించబడిన చట్టమని, ఇది నిర్ధిష్ట దేశాల నుండినిర్థిష్ట వర్గాలకు… స్పష్టమైన తేదీలతో కూడిన సడలింపు అందించడానికి ప్రయత్నిస్తుందని ఆ మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో పేర్కొంది.
2019లో చట్టంగా మారిన సిఎఎ ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఆప్గాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉండి హింసను ఎదుర్కొంటున్న హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీ, క్రిస్టియన్లు వర్గానికి చెందిన సభ్యులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభించనుంది.
ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. చేపట్టిన ఆందోళనల్లో 100 మంది చనిపోయారు. దీనిపై వివరణిస్తూ హోం మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికను రూపొందించింది. సిఎఎ భారతీయ పౌరులకు వర్తించదని, వారి హక్కులు ఏవిధంగా తగ్గించడం లేదంటూ మరోసారి స్పష్టం చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్