
గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జీవనయాత్రలో కలసి పయనించిన వ్యక్తులు పంచుకున్న స్ఫూర్తివంతమైన అనుభవాలను పొంది పరుచుకుంటూ మోడీస్టోరీ.ఇన్. పేరిట ఒక వెబ్ పోర్టల్ శనివారం ప్రారంభమైంది. నరేంద్ర మోదీ జీవితంలోని స్ఫూర్తిదాయకమైన క్షణాలను ఆయన సహప్రయాణికులు పంచుకోగా వాటిని కథల రూపంలో ఒక చోటుకు చేర్చే ప్రయత్నమే ఈ మోడీస్టోరీ పోర్టల్.
ఈ పోర్టల్‌ను మహాత్మా గాంధీ మనుమరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ప్రారంభించారు. ఈ విషయాన్ని పోర్టల్ తన ట్విటర్ హ్యాండిల్లో ట్వీట్ చేసింది. ఈ పోర్టల్‌లో నరేంద్ర మోదీతో తమకు గల అనుబంధాన్ని, ఆయనతో గడిపిన క్షణాలను, జ్ఞాపకాలను కొందరు పంచుకున్నారు.
బిజెపి కార్యకర్తగా మోదీ తన రాజకీయ జీవితం తొలి నాళ్లలో పంజాబ్‌లో పనిచేసినపుడు ఆయనతో తన అనుభవాలను పంజాబ్‌కు చెందిన బిజెపి నాయకుడు మనోరంజన్ కలియా పంచుకున్నారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన స్కూలు ప్రిన్సిపాల్ రస్బిహారీ మనియార్ మోదీ మోడీ పాఠశాల జీవితాన్ని తెలియచేశారు.
1990 దశకంలో మోదీ తన పర్యటనల సందర్భంగా తన ఇంట గడిపిన జ్ఞాపకాలను శారదా ప్రజాపతి గుర్తు చేసుకున్నారు. అదే విధంగా ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తోపాటు మరికొందరు ప్రధాని మోదీతో తమ అనుభవాలను పంచుకున్నారు.
More Stories
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ముస్లిం మతగురువు తౌకీర్ రాజా అరెస్టు
‘ఐ లవ్ మహమ్మద్’ వివాదంతో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు