వడ్ల కొనుగోలుపై కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. వడ్లు మాత్రమే కొనాలంటూ కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని చెబుతూ కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెల్వదని చెప్పారు. ఫామ్ హస్ లో వరి పండించి.. రైతులను మాత్రం వరేస్తే ఉరి అంటుండన్నారని ఎద్దేవా చేశారు.
రైతులు ఇబ్బంది పడుతుంటే చూసి కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డాయిరు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్ స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ తీరుతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం చేసిన కేసీఆర్ .. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో వెనకడుగు వేశారని పేర్కొన్నారు.
మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని కేసీఆర్ అంటున్నారని చెబుతూ అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని చెప్పారు. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏదిఏమైనా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తదని భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి 95 నుంచి 105 సీట్లు, టీఆర్ఎస్ కు 9 లేదా 10 సీట్లు వస్తాయని తేల్చి చెప్పారు.
కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు కేసీఆర్ కు నచ్చవని సంజయ్ స్పష్టం చేశారు. కశ్మీర్ లో జరిగిన అరాచకాలు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే దమ్ము కేసీఆర్ కు లేదని హెచ్చరించారు. కేసులతో బీజేపీ కార్యకర్తలను అడ్డుకోలేరన్నాని స్పష్టం చేశారు.
బోధన్ లో 35 మంది బీజేపీ కార్యకర్తలపై 307 కేసులు, సిరిసిల్లలో 25 మందిపై 307 కేసులు పెట్టారని సంజయ్ ధ్వజమెత్తారు. ఆపరేషన్ గంగాను కూడా కేసీఆర్ విమర్శిస్తున్నాడని అంటూ దేశంలో లేని సమస్యను తెలంగాణలో ఎందుకని ప్రశ్నించారు.

More Stories
జూబ్లీ హిల్స్ లో ఓట్ల చీలికతో బీజేపీ ‘కింగ్’
సెల్, జీన్ థెరపీ రంగంలో భారత్ బయోటెక్
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!