చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది.133 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం కూలిపోయింది. నైరుతి చైనాలోని వూహో సిటీ సమీపంలోని పర్వతశ్రేణుల్లో సోమవారం విమానం కూలిపోయింది. ఇది బోయింగ్ 737 విమానం. చైనాలోని కున్మింగ్ నుంచి గ్వాంగో సిటీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.11 నిమిషాలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానానికి సంబంధించి 2.22 నిమిషాలకి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమాన ప్రమాదం జరిగిన పర్వత ప్రదేశంలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టింది.
అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి, విమానంలోని ప్రయాణికులంతా మరణించే అవకాశాలున్నాయని అక్కడి మీడియా కథనం. విమాన ప్రయాణానికి సంబంధించి చైనా అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగి ఉంది. ఆ దేశంలో చివరి విమాన ప్రమాదం 2010లో జరిగింది.

More Stories
ప్రపంచ అభివృద్ధి ప్రమాణికాలపై పునరాలోచన
జి20 సదస్సుకు అమెరికా, రష్యా, చైనా అధినేతలు దూరం!
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో అరెస్ట్