
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై నేడు దేశ వ్యాప్తంగా సునామి సృష్టిస్తున్న `ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషలలో కూడా దుబ్బింగ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా దక్షిణాది భాషలు అన్నింటిలో ఈ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.
మార్చ్ 11న కేవలం 400 థియేటర్ లలో విడుదలై, ప్రజలలో సంచలనం కలిగించడంతో ఆ సంఖ్య వారం తిరిగేసరికి 4,000కు పైగా థియేటర్లకు పెరిగింది. బహుశా ఇటీవల కాలంలో చెప్పుకోదగిన నటులు, వాణిజ్యపరమైన విలువలు, భారీ సెట్టింగులు, అందాల తరాల నృత్యాలు, భీకరమైన ఘర్షణలు వంటి చిత్రీకరణలు లేకుండా ఇంతగా దేశ ప్రజల అందరిని కదిలించిన మరో చిత్రం లేదని చెప్పవచ్చు.
ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ 100కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. కంటెంట్ ఉంటే పేరున్న కథానాయకులతో పనేముంది అని ఈ చిత్రం నిరూపించింది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ పండిట్‌లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. 1990లో కాశ్మీర్ పండిట్‌లు ఏ విధంగా హింసించబడ్డారు? ఎలా చంపబడ్డారు? వాళ్ళు స్వదేశం నుంచి బలవంతగా ఎలా బయటకు పంపబడ్డారు? అనే కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక ఈ చిత్రాన్ని కేవలం ఉత్తరాదికె పరిమింతం చేయకుండా దేశం మెత్తానికి ఈ కథ గురించి తెలియాలని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
రూ 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికే రూ 350 కోట్లకు పైగా వసూలు చేసిన్నట్లు చెబుతున్నారు. ‘హేట్‌స్టోరీ’, ‘ద తాష్కెంట్ ఫైల్స్’ చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమా తీశారు. దీనికోసం ఆయన నాలుగేళ్లపాటు విస్తృతంగా పనిచేశారు. నాడు కశ్మీర్ నుంచి వలస వచ్చిన తొలితరం పండిట్లను ఇంటర్వ్యూ చేశారు.
వందలాది డాక్యుమెంటరీలు, లేఖలు, పలు పుస్తకాలు చదివి ఈ కథను తెరకెక్కించారు. సినిమా విడుదలయ్యాక తొలి రెండు రోజులూ మామూలుగానే నడిచింది. అయితే.. వివేక్ అగ్నిహోత్రి, ఇతర చిత్ర బృందం వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని, హోం మంత్రి అమిత్ షాను కలిశాక ఈ సినిమాపై అందరి దృష్టీ పడింది.
మరీ ముఖ్యంగా.. ‘కశ్మీర్ ఫైల్స్ చాలా మంచి చలనచిత్రం. మీరంతా చూడాలి. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి’ అని ప్రధాని మోదీ.. ‘కశ్మీర్ పండిట్ల వలసకు సంబంధించి ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం సత్యానికి అద్దం పడుతోందని, చారిత్రక తప్పిదాలు పునరావృతం కాకుండా సమాజం జాగృతం కావడానికి ఇలాంటి సినిమాలు దోహదపడగలవు’ అని అమిత్ షా అనడంతో దేశ ప్రజల దృష్టి ఆకట్టుకోవడం ప్రారంభమైంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు