#లవ్_జిహాద్: మతాంతర వివాహానికి మరో మహిళ బలి

“నేను ఎంబీఏ చదువుతున్న రోజుల్లో అతడు పరిచయం అయ్యాడు.. పేరు మొహమ్మద్ ఇజాజ్. ఆటో నడిపేవాడు. అయితే చదువుకుంటూ ఖర్చుల కోసం ఆటో నడుపుతున్నాను అని చెప్పడంతో అతడిపై గౌరవం, ఆసక్తి ఏర్పడ్డాయి. మొదట్లో స్నేహం చేశాడు.. అన్ని విషయాల్లో సహాయంగా ఉండేవాడు..  తర్వాత నీవే నా ప్రపంచం.. నీతోనే నా జీవితం అన్నాడు. ప్రేమ మైకంలో అతడిని మనస్ఫూర్తిగా విశ్వసించాను.. మతం అనేది మనుషులకే కానీ ప్రేమకు లేదు అనుకున్నాను.. కానీ నేను ప్రేమిస్తున్నది కుట్రపూరితమైన మత సిద్ధాంతం లక్ష్యంగా ఉన్న మనిషిని అని ఊహించలేకపోయాను.  చివరికి ఇప్పుడిలా శరీరంలో 23 కత్తిపోట్లతో.. నా 2 ఏళ్ల బిడ్డ సైతం నన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఆస్పత్రిలో ఉన్నాను” అంటూ తన జీవితంలో జరిగిన విషాద ఘటనల గురించి  వివరించింది కర్ణాటకకు చెందిన అపూర్వా పురాణిక్.

తాజాగా ఇస్లామిక్ లవ్ జిహాద్ కు బలైన మరో మహిళ  అపూర్వ పురాణిక్ హృదయవిదారక గాథ ఇది. దేశంలో రోజూ ఇన్ని లవ్ జిహాద్ ఘటనలు వెలుగుచూస్తున్నా కూడా.. నా విషయంలో అలా జరగదు అనుకున్నానని.. ఫలితంగా తాను కూడా ఈ కుట్రకు బలి అయ్యానని వివరించింది అపూర్వ పురాణిక్. ప్రేమ పేరిట దేశంలో జరుగుతున్న కుట్రపూరితమైన ఇస్లామిక్ సైద్ధాంతిక లక్ష్యానికి బలికాకుండా హిందూ యువతులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా పిలుపునిచ్చింది.

ప్రేమ అంటూ పెద్దలను ఎదిరించి చేసుకున్న మతాంతర వివాహం తన జీవితాన్ని ఎలా సర్వనాశనం చేసిందో చెప్పిన అపూర్వ పురాణిక్.. ఆస్పత్రి బెడ్ మీద చావుబ్రతుకుల మధ్య వివరిస్తూ ఇచ్చిన వాఙ్మూలం తాలూకు వీడియో ఇస్లామిక్ లవ్ జిహాద్ పై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ రేకెత్తిస్తోంది. మతాంతర వివాహం తర్వాత జీవితంలో తనకు ఎదురైన దుర్భర పరిస్థితులు, ఎదుర్కొన్న కష్టాలు, జరిగిన నష్టాల గురించి  అపూర్వ పట్నాయక్ చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..

“తనది ఇస్లాం మతం.. మాది సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబం.. రోజూ కాలేజీకి వెళ్లే సమయంలో తన ఆటోతో ఎదురయ్యేవాడు.. పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహంతో అతనే తన ఆటోలో కాలేజీకి నన్ను డ్రాప్ చేసేవాడు. అంతేకాదు అన్ని విషయాల్లోనూ  సహాయంగా ఉండేవాడు. క్రమక్రమంగా మా స్నేహం ప్రేమగా మారింది.  నీవే నా ప్రపంచం.. నీతోనే నా జీవితం అన్నాడు. మనం కలిసి జీవించడానికి మతం ఏమాత్రం అడ్డురాదు అన్నాడు. పెళ్లయ్యాక నీవు నీ మత సాంప్రదాయాలు పాటించు, నీకు నచ్చినట్టు ఉండు.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేవాడు. పెళ్లికి ముందు ఏ సందర్భంలో కూడా మా మధ్య ‘మతం’ ప్రస్తావన కూడా తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. దీంతో అతడిపై పూర్తి నమ్మకం ఏర్పడింది.

మా విషయం ఇంట్లో తెలిసింది..  పెళ్ళికి అంగీకరించలేదు.. “జాగ్రత్తగా ఉండాలమ్మా” అని సుతారంగా హెచ్చరించారు. అలా ఎందుకు హెచ్చరిస్తున్నారో అప్పుడు నాకు అర్ధంకాలేదు.  “ప్రేమకు మతం లేదు” అని ప్రచారం చేసే `ప్రోగ్రెసివ్’ మీడియా ప్రభావం నాపై బలంగా పడింది.. నా ఇజాజ్ అందరిలాంటి వాడు కాదు అని నాకు నేనే గట్టిగా సర్దిచెప్పుకున్నాను. అయినా ఇది నా జీవితం.. నిర్ణయం తీసుకోవాల్సింది నేను.. పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత.. నా జీవితం నా ఇష్టం అనుకున్నాను. తల్లిదండ్రులను ఎదిరించి  2018లో ప్రేమ వివాహం చేసుకున్నాము.ప్రేమకు మతం లేకపోవచ్చు.. కానీ ప్రేమించినట్టు నటించే మనుషులకు మతం ఉంటుందన్న విషయం పెళ్ళయాక కానీ అర్ధం కాలేదు. పెళ్లితో నా పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది. ప్రేమించిన వాడి వికృత మతమౌఢ్యం క్రమక్రమంగా బయటపడసాగింది. మతపరమైన అణచివేతకు గురయ్యాను.

పెళ్లికి ముందు నా పేరు అపూర్వ పురాణిక్.. పెళ్లి అయ్యాక అర్ఫా బానో అయ్యాను. నన్ను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడు. హిజాబ్ ధరించమని వేధించేవాడు. కనీసం స్కూటీ నేర్చుకోవడానికి కూడా వాళ్ళ మతం ఒప్పుకోదు అన్నాడు. వైవాహిక జీవితంలో మతం అనేది ఏమాత్రం అడ్డంకి కాదు అన్నవాడే సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిపెరిగిన నాతో మాంసాహారం వండించేవాడు. నాకు పుట్టిన బిడ్డకు కూడా మాంసాహారం బలవంతంగా తినిపిస్తూ వికృత ఆనందం పొందేవాడు. నన్ను మహిళగా కాదు కదా కనీసం మనిషిగా కూడా చూసేవాడు కాదు. నా బ్రతుకు కుక్క కన్నా హీనంగా మారింది.

ఈ క్రమంలో అతని గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది. 14 ఏళ్ల క్రితమే అతడికి మరొక మహిళతో వివాహం అయ్యింది. అప్పటికే అతడికి ముగ్గురు సంతానం. నేను అతడికి రెండవ భార్యను. అది తెలియగానే నా కాళ్ళ క్రింద భూమి కంపించినట్టయింది.. చుట్టూ నైరాశ్యం ఆవహించింది. ఇప్పుడు నాకు దిక్కెవరు? ఈ దారుణం నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించాను. “జాగ్రత్తమ్మా” అని తల్లిదండ్రులు ఎందుకు అంతలా చెప్పారో సాంస్కృతిక, ధార్మిక దృష్టికోణం నుండి ఆలోచించాను. అప్పటికి కానీ నా మనసుకు కమ్ముకున్న మత్తు తెరలు వీడలేదు, విషయం అర్ధం కాలేదు. ఎంతచెప్పినా వినకుండా, సాంస్కృతిక విలువలకు తిలోదకాలిస్తూ, ‘ప్రేమ’ అనే మైకంలో పడి, వారు ప్రసాదించిన ఈ జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నందుకు ప్రాయశ్చిత్తంగా వారి పాదాలను కన్నీటి ధారలతో కడగాలనిపించింది.

అదృష్టవశాత్తు ఆ షాక్ నుండి తేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నా తల్లిదండ్రులే ఇక దిక్కు అనుకుని ఆలస్యం చేయకుండా వారి చెంతకు చేరాను. ఇప్పటిదాకా జరిగినది ఇక చాలు అనుకుని, నా కాళ్లపై నేను జీవించాలి అనుకున్నాను. విడాకులకు అప్లై చేశాను. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను..

అయినా ఇప్పటికీ లవ్ జిహాద్ భూతం నన్ను వదల్లేదు.. పుట్టుంటికి వచ్చాక కూడా లవ్ జిహాదీ నుండి వేధింపులు అధికమయ్యాయి. అతడి నుండి ఉర్దూ భాషలో అసభ్య మెసేజీలు రావడం మొదలయ్యాయి. ఇంకా ఎన్ని రోజులు, విడాకులు వచ్చేస్తే ఇక స్వేచ్ఛగా ఉండొచ్చులే సర్దిపుచ్చుకున్నాను. అయితే ఒక రోజు నేను డ్రైవింగ్ స్కూల్లో ఉండగా, అక్కడ నాపై దాడి చేసి అత్యంత పైశాచికంగా  23సార్లు కత్తితో వేటు వేసాడు. నా విడాకుల కేసులో  కోర్ట్ విచారణకు కేవలం ఒక్క రోజు ముందు ఈ ఘటన జరిగింది. ఇప్పుడు నా 2ఏళ్ల కూతురు కూడా నన్ను గుర్తుపట్టట్లేదు.

సందేహం ఏమాత్రం లేదు.. ఇది ముమ్మాటికీ లవ్ జిహాద్.. భారతదేశం మొత్తం ఇదే నడుస్తోందన్న విషయం పూర్తిగా నష్టపోయాకే అర్ధమైంది’ అంటూ విలపించసాగింది అపూర్వ పురాణిక్.

అయితే ఈ యావత్ కథలో మరో ఊహించని ఘటన గురించి కూడా అపూర్వ పురాణిక్ బయటపెట్టింది. ప్రేమ వ్యవహారం నడుస్తున్న సమయంలో, పెళ్లికి ముందు ఇజాజ్ అపూర్వపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తా అని బెదిరించాడని,  కుటుంబం పరువు ఎక్కడ బజారుపాలు అవుతుందో అన్న భయంతో ఈ విషయం బయటపెట్టలేదు అని తెలిపింది. అయితే పెళ్లి ద్వారా దీనికి పరిష్కారం వస్తుంది అనుకున్నాను కానీ జీవితమే నాశనం అవుతోందన్న విషయం గ్రహించలేకపోయాను అని తెలిపింది అపూర్వ పురాణిక్.

లవ్ జిహాద్ ఎంతటి ప్రమాదకరమో తన జీవితమే ఒక ఉదాహరణ అని అంటోంది అపూర్వ. ఇలాంటి ఘటనలు అనేకం దేశంలో వెలుగులోకి వస్తున్నా కూడా తాను పట్టించుకోకుండా  ‘ప్రేమ’ అనే మైకంలో తప్పు చేశానని, ఇలాంటి తప్పు ఎవరూ చేయకూడదని అపూర్వ కోరుతోంది. మతాంతర వివాహాలు జీవితాలకు చేటు చేస్తాయని.. ‘ప్రేమకు మతం లేదు’ అని భావించే వారు ఇప్పటికైనా తేరుకోవాలని హితవు పలుకుతోంది.

 

 

Source: TheCommune