ప్లాస్టిక్ వ్యర్ధాలపై భారత్ తీర్మానంపై అపూర్వ మద్దతు 

ప్లాస్టిక్ వ్యర్ధాలపై భారత్ తీర్మానంపై అపూర్వ మద్దతు 

చాలాకాలంగా ప్రపంచాన్ని ప్రపంచాన్ని భయపెడుతూ, మానవాళిని వణికిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలపై పోరుతూ భారత్ ప్రవేశపెట్టిన తీర్మానంకుపై నైరోబియాలో మూడు రోజుల పాటు జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సులో అపూర్వ మద్దతు లభించింది.

నైరోబీలో జరిగిన ఒప్పందం తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరించే వారి ప్రాముఖ్యతను గుర్తించింది. పొట్టకూటి కోసం చెత్తకుప్పల్లోనూ, వ్యర్థాల మంటల్లో విషపూరిత వాయువులను పీలుస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరుచేసే వారిని ఈ సమావేశంలో తొలిసారి అధికారికంగా గుర్తించింది. ‘ప్లాస్టిక్ సంక్షోభం’పై చర్యలు తీసుకునేందుకు దాదాపు 200 దేశాలు చేతులు కలిపాయి.

ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో తాము కూడా భాగస్వాములమవుతామని కొలంబియాలోని బొగోటోకు చెందిన సిలివియో రూయిజ్ చెప్పారు. ఆయన తన 12 ఏళ నుంచే వ్యర్థాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘లాటిన్ అమెరికన్, కరీబియన్ నెట్‌వర్క్ వేస్ట్ పికర్స్’ నేతగా ఉన్నారు.

పేదరికంలో మగ్గుతున్న తాము రోజుకు 12, 14 గంటలు.. ఒక్కోసారి 16 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుందని రూయిజ్ చెప్పారు. కాగా, ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభ నివారణకు తీసుకునే ఈ ఒప్పందం చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలని నిర్దేశిస్తోంది.

ప్లాస్టిక్ ఉత్పత్తి నుంచి పారవేయడం, రీసైక్లింగ్, పునర్వినియోగం వరకు ఆయా ప్లాస్టిక్ వస్తువుల పూర్తి జీవితకాల చక్రాన్ని తప్పనిసరిగా పరిష్కరించాలని నిర్దేశిస్తుందని ఐక్యరాజ్య సమితి సభ్యులు పేర్కొన్నారు.