గాంధీజీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అతను తన జీవితంలో నిరంతరం చేసిన ప్రయోగాలు. ఆయన ఎప్పటికప్పుడు తనకు తానుగా నిజాయితీగా ఉంటూ అసంపూర్ణతల నుండి పరిపూర్ణత వైపు పయనించారు. అతని మొదటి ప్రయోగం, అత్యంత విజయవంతమైన ప్రయోగం, నిస్సందేహంగా, తనతోనే చేసుకొనేవారు. ఆయన ఆ ప్రయోగాలను “సత్యంతో నా ప్రయోగాలు” అనే పేరుతో వెలువడిన తన ఆత్మకథలో ఆయనే స్వయంగా వ్రాసుకున్నారు.
బాపుతో పరిచయం ఉన్న వారందరూ, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారితో సహా, ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని గ్రహించేవారు. తన ఆత్మకథలో, గాంధీజీ తన బాల్యం గురించి చాలా వివరంగా రాశారు. ఆయన బాగా సంపన్నమైన, అత్యంత గౌరవనీయమైన కుటుంబంలో జన్మించారు. పాఠశాలలో, తాను ఒక సాధారణ విద్యార్థిని మాత్రమే అని ఆయన తనను తాను ఒప్పుకున్నారు.
కఠినమైన శాఖాహారం కుటుంభం నుండి వచ్చినప్పటికీ మాంసం తిన్నారు. ధూమపానం చేయడానికి ప్రయత్నించారు. జేబు ఖర్చుల కోసం సోదరుడి నుండి కొంచెం బంగారాన్ని దొంగిలించారు. ఇవి తనను శారీరకంగా, నైతికంగా ప్రభావితం చేయడంతో ఆ రెండింటినీ వదులుకున్నారు.
ఒకసారి ఆయన వేశ్యల ఇంటికి వెళ్లి, మంచం మీద ఉన్న ఓ స్త్రీ దగ్గర కూర్చున్నాడు. అయితే అతనిలో విశ్వాసం కనిపించక పోవడం, భయపడుతూ ఉండడంతో ఆమె కోపంతో అతనిపై కేకలు వేసి అక్కడినుండి వెళ్లిపొమ్మని గదిమింది.
తన తండ్రి మరణానంతరం, తన తండ్రి స్నేహితుని సలహాతో, బాపు ఇంగ్లాండ్లో బార్ చదవాలని నిర్ణయించుకున్నారు. మనల్ని ఆకర్షించే ఒక సంఘటన ఏమిటంటే, ఆయన తన సామజిక వర్గం నాయకుల ఆదేశానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్కు వెళ్లారు.
గాంధేయ సిద్ధాంతం ప్రధాన సూత్రాలలో ఒకటి తనకు తానుగా నిజాయితీగా ఉండటం. “క్షణం క్షణానికి నాకు నేను నిజాయితీగా ఉంటే, నా ముఖంలో ఎగిరిపోయే అన్ని అసంపూర్ణతలను నేను పట్టించుకోను” అని దృఢ నిబద్ధతతో స్వయంగా అంగీకరించారు.
గాంధీజీ గురించి విమర్శనాత్మకంగా ఉండే ప్రఖ్యాత రచయిత నీరజ్ చౌదరి ఆయన గొప్పతనం గురించి సంక్షిప్తంగా ఈ విధంగా చెప్పారు. మహాత్మా, ‘మనిషి మరియు ప్రజానీకం ఒక్కటయ్యారు’.

More Stories
సుప్రీంకోర్టులో ట్రంప్ టారీప్లపై భారత సంతతి లాయర్ సవాల్
74 శాతం భారతీయ విద్యార్థులను తిరస్కరించిన కెనడా
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన