అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ ఆంక్షలు పొడగింపు

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ ఆంక్షలు పొడగింపు
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‍‌షోలపై విధించిన నిషేధాన్ని ఈనెల 22వ తేదీ వరకూ ఎన్నికల కమిషన్ పొడిగించింది. దీనికి ముందు విధించిన నిషేధం శనివారంతో ముగియడంతో ఈసీ ఈ గడవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం జనవరి 22 వరకూ పొడిగిస్తున్నట్టు చెప్పింది.
 
శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, రాజకీయ పార్టీలు ఇండోర్ మీటింగ్స్‌లో 300 మంది లేదా సీట్ల సామర్థ్యంలో 50 శాతం మంది పాల్గొనేందుకు ఈసీ అనుమతించింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) నిబంధనలను, కరోనా  మార్గదర్శకాలను అన్ని రాజకీయ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎంసీసీ, కరోనాకు సంబంధించిన ఆదేశాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలను ఈసీ ఆదేశించింది.
ఎన్నికలు జరగాల్సిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మఇిపూర్, గోవాలో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. భారీ ఎత్తున నమోదవుతున్న కేసులు ఆయా రాష్ట్రాల్లో. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 
 
తర్వాత పరిస్దితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఇప్పుడు నిషేధంపై సమీక్ష నిర్వహించి.. పొడగింపు నిర్ణయం వెల్లడించింది. 
ఎస్పీ అభ్యర్థి అరెస్ట్ 
ఇలా  ఉండగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ కైరానా అభ్యర్థిగా ప్రకటించిన నహిద్ హసన్‌ను గ్యాంగ్‌స్టర్ చట్టం కింద యుపీ పోలీసులు అరెస్టు చేశారు. కైరానా ఎమ్మెల్యేగా కూడా హసన్ ఉన్నారు.
గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద యూపీ పోలీసులు ఆయనను శనివారంనాడు అరెస్టు చేసి సిటీ కోర్టు ముందు హాజరుపరిచారు.  ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రెండ్రోజుల క్రితమే కైరనా నియోజకవర్గం అభ్యర్థిగా ఆయన పేరును సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. 2021 ఫిబ్రవరిలో హసన్, ఆయన తల్లితో సహా 40 మందిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.