
మావోయిస్టు ఉద్యమంలో లైంగిక వేధింపులు సర్వసాధారణమని గతంలో పలు కధనాలు వెలుగులోకి వచ్చాయి. దళాలలో చేరిన మహిళల పట్ల చిన్న చూపు చూడడం జరుగుతూ ఉంటుంది. వారికి పురుషులతో సమానంగా హోదా ఇవ్వరు. మంచి ఆయుధాలు కూడా ఇవ్వరు.
పైగా భద్రతా దళాల కాల్పులలో అత్యధిల్లగామా చనిపోస్తున్నది కూడా మహిళలే కావడం గమనార్హం. వారి వ్యక్తిగత ఇస్థాయిస్తాలను అణచివేస్తుంటారు. తాజాగా అటువంటి మరో సంఘటన జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఒక నక్సల్ జంటను, మరో వ్యక్తిని మవోయిస్టులు వేర్వేరు సంఘటనల్లో చంపివేసినట్లు పోలీసులు తెలిపారు.
గంగలూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతం నుంచి పరారైన ఒక నక్సల్ జంటను మావోయిస్టులు గురువారం కాల్చివేసినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. అదే ప్రాంతంలో మరో వ్యక్తిని కూడా మావోయిస్టులు కాల్చిచంపారని పోలీసులు తెలిపారు.
మావోయిస్టు మిలీషియా ప్లటూన్ కమాండర్ కమ్లూ పూనెమ్, మిలీషియా సభ్యురాలు మంగి ఇటీవల పెళ్లి చేసుకోవడానికి మావోయిస్టు క్యాంపు నుంచి పారిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందినట్లు ఐజి(బస్లర్ రేంజ్) సుందర్రాజ్ పి తెలిపారు.
అయితే తమ సహచరుల ఆచూకీని కనిపెట్టిన నక్సల్స్ వారిని పట్టుకుని, ఇందినార్ గ్రామంలో ప్రజా కోర్టు నిర్వహించి వారిని దారుణంగా హతమార్చారని ఆయన చెప్పారు. నక్సల్స్ హతమార్చిన మూడో వ్యక్తి వివరాలు ఇంకా అందవలసి ఉందని ఆయన తెలిపారు.
More Stories
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా
శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల కలర్ ఫొటో!